సూపర్ స్టార్ ని కలిసిన మంచు విష్ణు.. 'మా' ఎన్నికల్లో పోటీ!

  • IndiaGlitz, [Monday,June 21 2021]

ఈసారి 'మా' అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాను 'మా' ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా సమాచారం మేరకు హీరో మంచు విష్ణు కూడా 'మా' ఎన్నికలలో అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రకుల్ .. హరీష్ శంకర్ సపోర్ట్

మంచు విష్ణు సైలెంట్ గానే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేశారు. నేడు మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలసి సూపర్ స్టార్ కృష్ణని కలిశారు. 'మా' ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విష్ణు కృష్ణని కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నటుడు నరేష్ ఈసారి పోటీ చేయడం లేదు.

దీనితో నరేష్ ప్రకాష్ రాజ్, విష్ణులలో ఎవరో ఒకరికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కృష్ణ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా విష్ణు ఈ ఎన్నికని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో తాను పోటీ చేయబోతున్నట్లు అధికరించగా ప్రకటించనున్నారు.

తాజాగా కృష్ణని కలిసిన విష్ణు త్వరలో ఇండస్ట్రీలోని సీనియర్స్ అందరిని కలవనున్నట్లు టాక్. తన విజయం కోసం విష్ణు అందరి మద్దతు కూడబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ.. చిరంజీవితో సన్నిహితంగా ఉంటోంది. పలు వేదికలపై మోహన్ బాబు, చిరంజీవి మధ్య ఆప్యాయత చూశాం.

త్వరలో విష్ణు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవబోతున్నాడట. ఇదిలా ఉండగా మరోవైపున ప్రకాష్ రాజ్ కూడా తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మా ఎన్నికలో పోటీ చేయబోతున్న సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. త్వరలో మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి.

More News

2021లో యూట్యూబ్ ని ఊపేసిన సాంగ్స్

ఇప్పటి వరకు 2021లో కొన్ని పాటలు యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఆ పాటల వివరాలు తెలుసుకుందాం.

అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రకుల్ .. హరీష్ శంకర్ సపోర్ట్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా వార్తల్లో నిలిచింది.

వైరల్ పిక్: RRR సెట్లో రాంచరణ్.. పవర్ ఫుల్ లుక్!

తెలంగాణలో లాక్ డౌన్ ముగియడంతో అన్ని చిత్రాలు షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతున్నాయి.

నా గర్ల్ ఫ్రెండ్ మరో వ్యక్తితో.. ఆసక్తి రేపుతున్న 'వద్దురా సోదరా' మోషన్ పోస్టర్!

కన్నడ యంగ్ హీరో రిషి ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. రిషి నటించిన లేటెస్ట్ మూవీ 'వద్దురా సోదరా'.

హరీష్ రావుకు తప్పిన ఘోర ప్రమాదం.. మూడు కార్లు ఢీ, అడవి పందుల వల్లే.. 

మంత్రి హరీష్ రావు ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. అయితే ఈ సంఘటనలో హరీష్ రావు క్షేమంగా బయటపడడం అదృష్టకరం.