close
Choose your channels

టీడీపీ ఘోర పరాయజం.. బాబుపై మంచు విష్ణు పంచ్‌లు!

Sunday, May 26, 2019 • తెలుగు Comments

టీడీపీ ఘోర పరాయజం.. బాబుపై మంచు విష్ణు పంచ్‌లు!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వగా.. వైసీపీ విజయ దుందుభి మోగించింది. కనివినీ ఎరుగని రీతిలో విజయ డంఖా మోగించి వైఎస్ జగన్ హిస్టరీ క్రియేట్ చేశారు. వైసీపీ విజయకేతనం ఎగరేసిందని పార్టీ శ్రేణులు, వీరాభిమానులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందంలో మునిగి తేలుతుండగా.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఓటమికి వెయ్యి కారణాలు అన్నట్లు.. ఇంకా కారణాలు కనిపెట్టే.. వెతికే పనిలో నిమగ్నమైంది. సో.. ఇది మాత్రం కోలుకోలేని ఎదురుదెబ్బ.. అసలు పార్టీ ఉంటుందో..? ఉండదో అన్న అనుమానం కలుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. టీడీపీ ఓటమిపై వైసీపీ వీరాభిమానులు, వైసీపీకి చెందిన సినీ నటులు తెలుగు తమ్ముళ్లుపై సెటైర్లు విసురుతున్నారు. ఇప్పటికే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, చిన్ని కృష్ణ, జీవిత రాజశేఖర్ దంపతులు, పోసాని మురళీ కృష్ణ, కృష్ణుడు, పూరీ జగన్నాథ్‌తో పాటు పలువురు స్పందించారు. మరికొందరు నటీనటులు సోషల్ మీడియా వేదికగా జగన్‌కు అభినందనలు తెలిపారు.

బాబు సెటైర్లు..!

తాజాగా.. చంద్రబాబుపై మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా పంచ్‌ల వర్షం కురిపించారు. "నారా (NARA) అంటే.. N-జాతీయ స్థాయిలో(National) A-ఆశయం(Ambition).. R-ప్రాంతీయ స్థాయిలో(Regional) A-ఆకాంక్షలు(Aspirations). నాకు బలమైన భావన ఉంది.. మన ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీజీ ఎవర్ని ఇలా ట్రోల్ చేశారో.. మనకూ తెలుసు" అన్నారు. నారా పేరుతో ప్రధాని కొత్త స్లోగన్‌తో ముందుకొస్తే.. దానిని బాబుకు లింక్ పెడుతూ విష్ణు వెటకారం చేసినట్లు ఈ ట్వీట్‌ పెట్టారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్‌ను లోటస్‌పాండ్‌లో విష్ణు కుటుంబ సమేతంగా వెళ్లి కలిసొచ్చిన సంగతి తెలిసిందే.

Get Breaking News Alerts From IndiaGlitz