ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొన్న మంచు విష్ణు-సురభి!

  • IndiaGlitz, [Thursday,February 16 2017]

రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు-సురభి జంటగా తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు మంచు విష్ణు-సురభిలపై భారీ సెట్ లో లవ్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. సదరు సన్నివేశం ట్రాఫిక్ జామ్ లో చిత్రీకరించి ఉండాల్సి రావడంతో పెద్ద సంఖ్యలో వెహికిల్స్ ను ఏర్పాటు చేశారు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రేపటితో రెండోభారీ షెడ్యూల్ పూర్తికానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ.. "నేడు రామోజీ ఫిలిమ్ సిటీలో వేయబడిన ప్రత్యేకమైన సెట్ లో హీరోహీరోయిన్ల నడుమ లవ్ సీన్ ను చిత్రీకరిస్తున్నాం. అలాగే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిపాం. మంచు విష్ణుకి కథానాయకుడిగా మంచి పేరు తీసుకురావడంతోపాటు కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూనివర్సెల్ కాన్సెప్ట్ కావడంతో బైలింగువల్ సినిమాగా రూపొందిస్తున్నాం. దర్శకుడు జి.ఎస్.కార్తీక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం బాగుంది. ఇప్పటివరకూ వచ్చిన ఔట్ పుట్ తో మా యూనిట్ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తమన్ నేతృత్వంలో పాటల కంపోజింగ్ కూడా జరుగుతోంది. త్వరలో సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తాం" అన్నారు.
సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట (జాన్), కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్!!

More News

'రోగ్ ' ఫస్ట్ లుక్ కు ట్రెమెండస్ రెస్పాన్స్

బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్ వంటి డిఫరెంట్ క్యారెక్టర్ బేస్డ్ బ్లాక్బస్టర్ చిత్రాలను రూపొందించిన డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్'.

యంగ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా 'తొలి పరిచయం' ట్రైలర్ లాంచ్

పియుకె ప్రొడక్షన్స్ పతాకంపై దీపక్కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి పరిచయం’. ఎల్. రాధాకృష్ణ దర్శకుడు. వెంకీ, లాస్య హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్ చిత్రం 'రారా' తొలి ప్రచారచిత్రం

అన్నయ్య మెగాస్టార్ 'చిరంజీవి' తమ్ముడు హీరో 'శ్రీకాంత్' వీరిద్దరి అనుబంధం చిత్రపరిశ్రమలో ప్రత్యేకమైనది.. ఆ అనుబంధమే మరోసారి శ్రీకాంత్ నూతన చిత్రానికి వేదిక అయింది.

ఓవర్ సీస్ లో 'కాటమరాయుడు' తఢాఖా

పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కిషోర్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం `కాటమరాయుడు`.

మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్రాజు నిర్మాతగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన క్యారెక్టర్ బేస్డ్ లవ్స్టోరీ `నేను లోకల్`. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్తో భారీ ఓపెనింగ్స్ను సాధించింది.