close
Choose your channels

మ‌ణిర‌త్నం 'న‌వాబ్‌'.. విడుద‌ల ఎప్పుడంటే..

Monday, February 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, అదితి రావ్ హైద‌రీ, ఐశ్వ‌ర్యా రాజేష్‌, ప్ర‌కాష్ రాజ్‌, మ‌న్సూర్ అలీ ఖాన్‌.. ఇలా భారీ తారాగ‌ణంతో లెజండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం త‌మిళ, తెలుగు భాష‌ల్లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో 'న‌వాబ్' పేరుతో, త‌మిళంలో 'చెక్క చివ్వంద వాన‌మ్' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా.. ఈ రోజు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. కేవ‌లం 60 రోజుల్లో ఈ సినిమా పూర్తిచేయ‌డానికి మ‌ణిర‌త్నం ప్లాన్ చేసుకున్నార‌ట‌.

షెడ్యూల్స్ మ‌ధ్య వ‌చ్చే గ్యాప్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు ప‌క్క‌న పెడితే.. జూలై నాటికి సినిమా విడుద‌ల‌కి రెడీ అయిపోతుంద‌ని చెన్నై సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఎ.ఆర్‌.రెహ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని మ‌ద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.