close
Choose your channels

శిష్యుడి స్పీడుకు మ‌ణిశ‌ర్మ బ్రేకులు?

Thursday, November 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శిష్యుడి స్పీడుకు మ‌ణిశ‌ర్మ బ్రేకులు ?

సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశర్మ ఒక‌ప్పుడు స్టార్ మ్యూజిషియ‌న్‌గా స్టార్ హీరోలంద‌రి సినిమాల‌కు సంగీతం అందించిచాడు. అస‌లు డేట్స్ ఖాళీ లేకుండా ఓ వెలుగు వెలిగాడు. క్ర‌మంగా ఆయ‌నకు దేవిశ్రీ ప్ర‌సాద్ పోటీగా మారాడు. దేవిశ్రీ క్ర‌మంగా నెంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తెలుగు, త‌మిళ చిత్రాల్లో నిల‌దొక్కుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌ణిశర్మ శిష్యుడైన త‌మ‌న్ రంగ ప్ర‌వేశం చేశాడు. క్ర‌మంగా త‌మ‌న్ నిల‌దొక్కుకున్నాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ స్పీడుకు బ్రేకులు వేసిన త‌మ‌న్ ప్ర‌స్తుతం నెంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల‌కు త‌మ‌నే మ్యూజిక్ ఇస్తున్నాడు. దేవిశ్రీ, త‌మ‌న్ స్పీడుకు మ‌ణిశర్మ క‌నుమ‌రుగైపోయాడు. అయితే రీసెంట్‌గా మ‌ణిశ‌ర్మ‌కు పూరి బ్రేక్ ఇచ్చాడ‌నే చెప్పాలి. ఆయ‌న మ‌ణిశ‌ర్మ సంగీతంలో చేసిన సినిమా ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ట‌య్యింది. ఈ సినిమా విజ‌యంలో మ‌ణిశ‌ర్మ సంగీతం కీ రోల్ పోషించింది. సీనియ‌ర్ అగ్ర హీరోలైన చిరంజీవి, వెంక‌టేశ్ మ‌ణిశ‌ర్మ మాకు సంగీతం అందించాల‌నేంతగా మ‌ణిశ‌ర్మ లైమ్ లైట్‌లోకి వ‌చ్చేశాడు.

మూడు పెద్ద సినిమాల‌కు మ‌ణిశ‌ర్మ సంగీతం..

సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మ‌ణిశ‌ర్మ ప్ర‌స్తుతం మూడు స్టార్ హీరోల సినిమాల‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నాడ‌ట‌. అందులో ఒక‌టి చిరంజీవి 152వ చిత్రం. చిరంజీవి, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే చిత్రానికి మ‌ణిశ‌ర్మ‌నే సంగీతం అందిస్తాడ‌ని టాక్‌. అలాగే వెంక‌టేశ్ హీరోగా రూపొందనున్న‌న త‌మిళ చిత్రం `అసుర‌న్‌` రీమేక్‌కి కూడా మ‌ణియే సంగీతం ఇస్తాడ‌ని టాక్‌. అలాగే పూరి డైరెక్ట్ చేయ‌బోయే త‌దుప‌రి చిత్రం `ఫైట‌ర్‌`కి కూడా ఈయ‌నే సంగీత ద‌ర్శ‌కుడ‌ని స‌మాచారం.

ఒక్క‌సారి మ‌ణిశ‌ర్మ ట్రాక్‌లోకి వ‌చ్చేశాడు. ఆయ‌న స్పీడు చూస్తుంటే ఇప్పుడు అగ్ర సంగీత ద‌ర్శ‌కుడిగా ఉన్న త‌మ‌న్ స్పీడుకి మ‌ణ‌శ‌ర్మ బ్రేకులు వేస్తాడ‌ని ఆయ‌న అభిమానులు చెప్పుకుంటున్నారు. మ‌రి నిజంగా మ‌ణిశ‌ర్మ త‌మ‌న్ స్పీడుకు బ్రేకులు వేస్తాడా? లేదా? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.