మరోసారి వాయిదా పడ్డ 'మణికర్ణిక'

  • IndiaGlitz, [Friday,May 18 2018]

విభిన్నమైన కథలతో ఆకట్టుకునే చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'మణికర్ణిక' సినిమాని తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ఈ చిత్రంలో జిష్షు సేన్ గుప్త, అంకిత లోఖండే, అతుల్ కులకర్ణి, వైభవ తత్వవాది, సోనూసూద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే.. ముందుగా ఈ మూవీని ఏప్రిల్ 27న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసారు. అయితే వి.ఎఫ్.ఎక్స్. పనులు పూర్తి కావడానికి కొంత సమయం పట్టనుండడంతో ఆగష్టు 15న రిలీజ్ చేయాలని నిశ్చయించారు.

కాని గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో దర్శకుడు క్రిష్ ఏమాత్రం రాజీ పడకపోవడంతో.. అప్పటికి కూడా ఈ గ్రాఫిక్స్ పనులు పూర్తి అయ్యేట్టుగా కనిపించడంలేదు. అందుకే ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తూ.. వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ విష‌యం పై క్లారిటీ వ‌స్తుంది.

More News

మ‌ళ్ళీ పోటీప‌డుతున్నారు

మరోసారి ఓ యంగ్ హీరోతో ఓ సీనియర్ హీరో పోటీ పడుతున్నారు. గతంలో ఇలా పోటీకి దిగిన సంద‌ర్భంలో విజయం యంగ్ హీరోనే వరించింది.

నిఖిల్ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి

'కిర్రాక్ పార్టీ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత, నిఖిల్ హీరోగా టీ.యన్.సంతోష్ దర్శకత్వంలో వస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు.

బాలిక విద్య కోసం బన్నీ వాసు ఆర్థిక సహాయం

ప్రముఖ నిర్మాత బన్నీ వాసు మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆడపిల్లలను చదివించాలని తపనపడే బన్నీ వాసు...

రైతుబంధు పధకం ఫలాన్ని తిరిగి ఇచ్చేసిన హరీష్ శంకర్

కమ్మదనం గ్రామం లో తనకు ఉన్న భూమికి గాను ప్రభుత్వం వారు ఇచ్చిన రైతుబంధు పధకం ఫలాన్ని సినీ దర్శకుడు హరీష్ శంకర్ ఎవరన్నా పేద రైతు సహయార్ధం వాడమని తిరిగి ఇచ్చేసారు.

స‌మంత అస్స‌లు త‌గ్గ‌డం లేదు

చెన్నై బ్యూటీ,  అక్కినేని వారి కోడలు సమంత ఓ విష‌యంలో త‌న తోటి హీరోయిన్ల కంటే మేటిగా ఉంద‌నే చెప్పాలి.