వారణాసి వేదికగా విడుదలైన 'మణికర్ణిక' టైటిల్ లోగో

  • IndiaGlitz, [Thursday,May 04 2017]

తెలుగులో "గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందింపజేసిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్ లోనూ "గబ్బర్ ఈజ్ బ్యాక్"తో తన సత్తాను చాటుకొన్నాడు. ఆయన తాజాగా తెరకెక్కించనున్న బాలీవుడ్ చిత్రం "మణికర్ణిక". వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చారిత్రక చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తోంది.
జీ స్టూడియోస్ సమర్పణలో కమల్ జైన్ ఈ చిత్రాన్ని కైరోస్ కంటెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చుతున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం సంగీత దర్శకత్వం వహించనున్నారు.
"మణికర్ణిక" టైటిల్ లోగో విడుదల మరియు రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ కార్యక్రమం వారణాసిలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర బృందం వారణాసిలో 20 అడుగుల పొడుగు "మణికర్ణిక" టైటిల్ లోగో పోస్టర్ ను విడుదల చేశారు. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది.. అనగా ఏప్రిల్ 27, 2018 విడుదల చేస్తున్నట్లు తెలిపారు!

More News

సూర్య సినిమా షూటింగ్ పూర్తి...

తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. అందుకే సూర్య యూనివర్సల్గా తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాల్లో నటిస్తుంటాడు.

రేపే నాని కొత్త సినిమా...

నేచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ హిట్ మూవీస్ చేసి ఇప్పుడు శివ నిర్మాణ దర్శకత్వంలో

మే 6న మళ్లీ వస్తున్న 'మన్యం పులి'

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సినిమా 'మన్యంపులి'.

కింగ్ నాగార్జున విడుదల చేస్తున్న హీరో తరుణ్ 'ఇది నా లవ్ స్టోరీ' టీజర్

అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్టైనర్స్ బ్యానర్పై తరుణ్, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తోన్న చిత్రం `ఇది నా లవ్స్టోరీ.

మే12న ప్రపంచ వ్యాప్తంగా 'వెంకటాపురం' విడుదల

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ &తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం.