close
Choose your channels

ఇప్పుడు నిర్మాత కూడా డ్రాప్‌...

Monday, September 10, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పుడు నిర్మాత కూడా డ్రాప్‌...కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో నటిస్తున్న చిత్రం `మ‌ణిక‌ర్ణిక‌`. ఈ సినిమా ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్‌. సినిమాలో మ‌రికొన్ని స‌న్నివేశాల‌ను డైరెక్ట్ చేయ‌మ‌ని కోరింది కంగనా. అయితే క్రిష్ `య‌న్‌.టి.ఆర్‌` సినిమాను డైరెక్ట్ చేయాల్సి ఉండ‌టంతో కంగనానే డైరెక్ట్ చేసుకోమ‌ని.. త‌న‌కు టెక్నిక‌ల్‌గా ఎడిటింగ్‌లో స‌పోర్ట్ చేస్తాన‌ని తెలిపారు. అయితే సినిమాకు అస‌లు స‌మ‌స్య‌లు ఇక్క‌డే మొద‌ల‌య్యాయి. కంగనా డైరెక్ష‌న్ స్టార్ట్ చేయ‌గానే సోనూసూద్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నారు.

కాగా ఇప్పుడు నిర్మాత కూడా సినిమా నుండి త‌ప్పుకున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ముందు అనుకున్న బ‌డ్జెట్ 70 కోట్లు.. అయితే ఇది కాస్త ఇప్పుడు 100 కోట్ల‌ను దాటేలా ఉండ‌టంతో నిర్మాణ బాధ్య‌త‌ల నుండి సంజ‌య్‌కుట్టి త‌ప్పుకున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న సినిమా విడుద‌లవుతుందని యూనిట్ ప్ర‌క‌టించింది. మ‌రి రీ షూట్స్ వల్ల సినిమా ఆలస్యం కాకుంటే అనుకున్న స‌మ‌యంలోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.