వెంక‌టేశ్ ఇంట్లో పెళ్లి భాజాలు..

  • IndiaGlitz, [Saturday,September 22 2018]

సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. ఆయ‌న కుమార్తె ఆశ్రితను హైద‌రాబాద్ రేస్ కోర్స్ చైర్మ‌న్ సురేంద‌ర్ రెడ్డి మ‌న‌వడు.. ర‌ఘురామిరెడ్డి త‌న‌యుడితో జ‌ర‌గ‌నుంది. ఇద్ద‌రు ఒక‌రికొక‌రు బాగా తెలుసు. ఇద్ద‌రు త‌మ ఇంట్లో పెద్ద వాళ్ల‌తో చెప్పారు.

వెంక‌టేశ్ షూటింగ్ నిమిత్తం ప్రాగ్‌లో ఉన్న కార‌ణంగా వెంక‌టేశ్ అన్న‌య్య, నిర్మాత ద‌గ్గుబాటి సురేశ్ వెళ్లి అబ్బాయి పెద్ద‌ల‌తో మాట్లాడ‌ట‌. త్వ‌ర‌లోనే వీరి నిశ్చితార్థం జ‌రగ‌నుంది. బేక‌ర్స్‌లో ప్ర‌త్యేక‌మైన కోర్సు చేసిన ఆశ్రిత రీసెంట్‌గా ఇన్‌ఫినిటీ ప్లాట‌ర్ అనే స్టాల్స్‌ను స్టార్ట్ చేసింది. ఇక అబ్బాయి త‌ర‌పున వ‌స్తే.. అబ్బాయి తండ్రి ర‌ఘురామిరెడ్డి.. ఆంధ్ర ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి పి.కిర‌ణ్‌కుమార్ రెడ్డికి స‌న్నిహితుడ‌ట‌.