close
Choose your channels

టీఎన్నార్ కుటుంబానికి డైరెక్టర్ మారుతి సాయం

Thursday, May 13, 2021 • తెలుగు Comments

ఇటీవల కరోనాతో మరణించిన జర్నలిస్ట్‌, నటుడు టీఎన్నార్‌ కుటుంబ సభ్యులను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి సాయం అందజేస్తున్నారు. టీఎన్నార్ హఠాన్మరణం ముఖ్యంగా ఇండస్ట్రీని కదిలించింది. సినీ ప్రముఖులతో ఎన్నో ఇంటర్వ్యూలు నిర్వహించిన టీఎన్నార్ కుటుంబానికి సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి టీఎన్నార్ సతీమణికి ఫోన్ చేసి ధైర్యం చెప్పడమే కాకుండా తక్షణ సాయం కింద లక్ష రూపాయలను పంపించిన విషయం తెలిసిందే.

అలాగే తనో మెట్టు ఎక్కేందుకు టీఎన్నార్ కారణమయ్యారంటూ ప్రముఖ నటుడు సంపూర్ణేష్ బాబు సైతం ఆయన సతీమణి అకౌంట్‌కు రూ.50వేలను పంపించారు. తాజాగా డైరెక్టర్ మారుతి టీఎన్నార్ కుటుంబాన్ని పరామర్శించారు. యాభై వేల రూపాయలను తక్షణ సాయంగా అందించారు. ఈ మొత్తాన్ని టీఎన్నార్‌ భార్య అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ‘టీఎన్నార్‌ మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నాం. మీ కుటుంబానికి అండగా ఉంటాం. మీరు కూడా ఆ కుటుంబానికి సాయం అందించండి’’ అని మారుతి ట్వీట్‌ చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz