మారుతి తదుప‌రి ఆయ‌న‌తోనేనా..?

  • IndiaGlitz, [Tuesday,December 24 2019]

రీసెంట్‌గా విడులైన 'ప్ర‌తిరోజూ పండ‌గే' చిత్రంతో ద‌ర్శ‌కుడు మారుతి సూప‌ర్‌హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. కామెడీ పండించ‌డంలో మారుతి ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన మార్కు చూపించాడు. ఇప్పుడు మారుతి త‌దుప‌రి సినిమా ఎవ‌రితో చేస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ వ‌ర్గాల్లో ప్ర‌ముఖ నిర్మాత డి.వి.వి.దాన‌య్య త‌న‌యుడు కిర‌ణ్ దాస‌రిని హీరోగా పెట్టి మారుతి సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే మారుతి స్ట్రాట‌జీ మ‌రో ర‌కంగా ఉంద‌ట‌. ఈ స‌క్సెస్ వ‌ల్ల శ‌ర్వానంద్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి యువ క‌థానాయ‌కులు మారుతితో ప‌నిచేయ‌డానికి ఆస‌క్తిగానే ఉన్నార‌ట‌. మారుతి వాళ్ల‌తో క‌థ‌ను ఓకే చేయించుకుని దాన్ని దాన‌య్య బ్యాన‌ర్‌లోనే చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.

దాన‌య్య కొడుకుని హీరోగా వెంట‌నే చేసేసి మారుతికి ఏదో చేసేయాల‌నైతేలేదు. కాస్త టైమ్ అటూ ఇటూ అయినా మ‌రో స్టార్ హీరోతో వెళ్లి మ‌రో హిట్ కొడితేనే ద‌ర్శ‌కుడిగా రేంజ్ పెరుగుతుందని మారుతి యోచ‌న‌గా క‌న‌ప‌డుతుంద‌ట‌. ఒక‌వేళ ఎవ‌రైనా స్టార్ హీరో సినిమాను ఓకే చేసి స‌మ‌యం తీసుకుంటే..ఆ గ్యాప్‌లో దాన‌య్య త‌న‌యుడితో సినిమా చేసేయాల‌ని కూడా అనుకుంటున్న‌ట్లు టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌కు చెక్ పెడుతూ మారుతి త‌న త‌దుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో వేచి చూడాలి.

More News

వెన్నునొప్పితో ఆస్పత్రికెళితే యువతి శరీరంలో బుల్లెట్.. అసలేం జరిగింది!?

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాకు చెందిన అస్మాబేగం అనే యువతి వెన్ను నొప్పితో నిమ్స్‌లో అడ్మిట్ అవ్వడంతో..

ప‌వ‌న్ 27వ చిత్రం.. డిఫ‌రెంట్ పాత్ర‌లో..

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌లోనే రాజ‌కీయాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి సినీ రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

విజయ్ దేవరకొండ విలన్ గా యంగ్ హీరో

కెరీర్ స్టార్టింగ్ లో విలన్ రోల్స్ లో నటించి ఆ తరువాత హీరోలుగా స్థిరపడ్డ వారు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

`స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3`లో ఐటెమ్ గ‌ర్ల్‌

బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో డ్యాన్స్ సినిమాలకు క్రేజ్ పెరిగింది. అంటే కథలో భాగంగా పాటలు రావటం, వాటిల్లో స్టెప్పులు వేయటం కాదు.

హీరో సిద్ధార్థ్ 'టక్కర్' ఫస్ట్ లుక్ విడుదల

హీరో సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.