మారుతి కొత్త కోరిక‌

  • IndiaGlitz, [Tuesday,March 08 2016]

మారుతి పేరు చెప్ప‌గానే అంచ‌లంచ‌లుగా ఎదిగిన ద‌ర్శ‌కుడు అనే మాట చ‌టుక్కున గుర్తుకొస్తుంది. సినిమాల్లోకి రాక‌ముందు యానిమేట‌ర్‌గా ప‌నిచేశారు మారుతి. ఆయ‌న‌కు ఆ అనుభ‌వం సినిమాల్లోనూ ఉప‌యోగ‌ప‌డింది. షాట్ డివిజ‌న్‌, బ్లాగ్స్ పెట్ట‌డంలో ఆయ‌నదైన శైలి క‌నిపించ‌డానికి ఈ అనుభ‌వం కూడా తోడైంద‌న్న‌ది వాస్త‌వం. ఇప్పుడు ఆ అనుభ‌వాల‌ను రంగ‌రించి మారుతి మ‌రో అడుగు ముందుకు వేయాల‌ని అనుకుంటున్నారు. పూర్తి స్థాయి యానిమేటెడ్ సినిమాను రూపొందించాల‌ని సంక‌ల్పిస్తున్న‌ట్టు చెప్పారు.

అన్న‌ట్టు మారుతి ప్ర‌స్తుతం బాబు బంగారం అనే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వెంక‌టేష్ హీరోగా న‌టిస్తున్న సినిమా ఇది. న‌య‌న‌తార నాయిక‌గా న‌టిస్తోంది. జులైలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. గిబ్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవ‌ల త‌మ సొంత ప్రాంతానికి వెళ్ళిన మారుతి యానిమేష‌న్ గురించి త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను బ‌య‌ట‌పెట్టార‌న్న‌మాట‌.

More News

18న దండ‌కార‌ణ్యం

మ‌న దేశంలో దాదాపు 12, 13 రాష్ట్రాల‌ను ఆనుకుని ఉన్న ప్రాంతానికి దండ‌కార‌ణ్యం అని పేరు. అక్క‌డ ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌డానికి ఆదివాసులు తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. అందులో భాగంగానే మార‌ణ‌హోమాల్లో ప్ర‌మిద‌ల‌వుతున్నారు.

రీబాక్ బ్రాండ్ అంబాసిడర్ గా క్వీన్...

బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతుంది.

రజనీకాంత్ కు కోర్టు సమన్లు..

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన చిత్రం లింగా.

కోలీవుడ్ లో టెంపర్

దయా పాత్రలో ఎన్టీఆర్ నటించిన సినిమా టెంపర్.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ నటించింది.

సినిమాలు చేయను - పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత జనసేన పార్టీని స్థాపించారు. అయితే క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపించాయి.