పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో 'మసక్కలి'

  • IndiaGlitz, [Thursday,June 29 2017]

సాయిరోన‌క్‌, శ్రావ్య, శిరీష వాంక్‌ హీరో హీరోయిన్లుగా డు గుడ్ ఫాలో రైట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం 'మ‌స‌క్క‌లి'.న‌బి ఏనుగుబ‌ల‌(మ‌ల్యాల‌) ద‌ర్శ‌క‌త్వంలో సుమిత్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది.

ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత సుమిత్ సింగ్ మాట్లాడుతూ - ''మ‌సక్క‌లి చిత్రం ఒక స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌. మా బ్యాన‌ర్‌లో రూపొందుతున్న తొలి చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు న‌బి ఏనుగుబ‌ల సినిమాను చాలా చక్క‌గా తెర‌కెక్కించారు. ప్ర‌తి స‌న్నివేశం విజువ‌ల్‌గా ఫ్రెష్ ఫీల్‌నిస్తుంది. మిహిరామ్స్ సంగీతం, సుభాష్ దొంతి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు చాలా ప్ల‌స్ అవుతుంది. అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరింది. సాయిరోన‌క్‌, శ్రావ్య, శిరీష వాంక్‌లు తెర‌పై చూడ చ‌క్క‌గా ఉంటుంది. సినిమాలో ప్ర‌తి పాత్ర‌కు చాలా ముఖ్య‌త్వం ఉంటుంది. సినిమాను చూసే ఆడియెన్స్ మంచి అనుభూతికి లోన‌వుతారు. ఈ నెల‌లో ఆడియో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం'' అని తెలిపారు.

సాయిరోనక్‌, శ్రావ్య‌, శిరీష వాంక్, కాశీ విశ్వ‌నాథ్‌, న‌వీన్ నేని, చ‌మ్మ‌క్ చంద్ర త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ః శివ శ‌ర్వాణ‌, సంగీతంః మిహిరామ్స్‌, సినిమాటోగ్ర‌ఫీః సుభాష్ దొంతి, నిర్మాతః సుమిత్ సింగ్‌, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః న‌బి ఏనుగుబ‌ల‌(మ‌ల్యాల‌).

More News

జూలై 14న టీమ్-5 విడుదల

భారత క్రికెట్ చరిత్రలో బౌలర్ గా,క్రికెటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్,

విశాల్ 'విలన్' లుక్ అదిరిందిగా...

తెలుగు, తమిళ చిత్రాలతో తన కంటూ ఓ మార్కెట్ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్. ఇప్పుడు మలయాళంలో కూడా నటించబోతున్నాడు. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ హీరోగా నటిస్తున్న చిత్రం విలన్లో విశాల్ విలన్గా కనపడనున్నాడనేది తెలిసిందే.

'2.0' ప్రమోషన్స్ స్టార్ట్...

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సైంటిఫికల్ విజువల్ వండర్ '2.0'.

నాని మూవీలో బాలీవుడ్ నటుడు...

వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం దర్శకత్వంలో

'జయదేవ్'తో గంటా రవికి గ్రేట్ ఫ్యూచర్ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ మాళవికా రాజ్ హీరోయిన్ గా డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో