Download App

విక్ర‌మ్ స్టైల్లో మాస్ మ‌హారాజా?

మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ‘ఖతర్నాక్’, ‘కిక్’, ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాల తర్వాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. రవితేజకు ‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయి శీను’ లాంటి  హ్యాట్రిక్ విజయాలను అందించిన శ్రీను వైట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు.

కాగా అక్టోబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ర‌వితేజ మూడు పాత్ర‌ల్లో న‌టిస్తున్నార‌ని వార్త‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో వార్తొక‌టి ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే.. ర‌వితేజ ఒక‌టే మూడు పాత్ర‌ల్లో అలరిస్తాడ‌ట‌. అంటే విక్ర‌మ్, శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అప‌రిచితుడు స్టైల్లో అన్న‌మాట‌. మ‌రి దీనిపై యూనిట్ ఏమైనా రిప్లై ఇస్తుందో లేక సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాలో చూడాలి.