ప‌క్కా మాస్ టైటిల్‌తో వెంక‌టేశ్ `అసుర‌న్‌`

  • IndiaGlitz, [Tuesday,January 21 2020]

త‌మిళంలో ధ‌నుష్ హీరోగా న‌టించిన చిత్రం 'అసుర‌న్‌'. వెట్రిమార‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్లు' ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ల‌బోయే ఈ సినిమా కోసం వెంక‌టేశ్ త‌న లుక్‌ను మార్చుకున్నాడు. వెంకటేశ్ సరసన కన్నడ హీరోయిన్ ప్రియమణి నటించనుంది.

వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొంద‌నున్న తొలి చిత్ర‌మిదే. ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ వార్తొక‌టి నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ సినిమాకు తెలుగులో 'నార‌ప్'ప అనే ప‌క్కా మాస్‌ టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌. భూ వివాదాల నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్క‌నుంది. తెలుగులో ఈ చిత్రాన్ని డి.సురేష్‌బాబు, క‌లైపులి థాను నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కించ‌నున్నారు. అలాగే వెంక‌టేశ్ కొడుకుగా న‌టించే యువ హీరో కోసం చిత్ర యూనిట్ అన్వేష‌ణ‌లో ఉంద‌ట‌. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లోనే సినిమాను విడుద‌ల చేయాల‌నేది చిత్ర యూనిట్ ప్లాన్‌.

More News

`RRR` టీమ్‌తో జ‌త క‌ట్టిన బాలీవుడ్ స్టార్‌

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం

ఇక రెండు నెల‌లు మ‌హేశ్ క‌న‌ప‌డ‌డు...!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఈ సంక్రాంతికి `స‌రిలేరునీకెవ్వ‌రు`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. పెద్ద స‌క్సెస్‌ను సొంతం చేసుక‌న్న సంగ‌తి తెలిసిందే.

`పింక్` మొద‌లెట్టిన ప‌వ‌న్‌.. వైర‌ల్ అవుతున్న ప‌వ‌న్ ఫొటో

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

అల్ల‌రి న‌రేశ్ కొత్త ప్ర‌య‌త్నం.. రీ ఎంట్రీ అనుకోవాలా?

నేటి త‌రం హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు అల్ల‌రి న‌రేశ్‌. త‌న‌దైన కామెడీ టైమింగ్ ఉన్న సినిమాల‌తో చాలా త్వ‌ర‌గా 50 సినిమాల‌ను చాలా త్వ‌ర‌గా పూర్తి చేసుకున్న అల్లరి న‌రేశ్‌కి

ఫైట‌ర్ స్టార్ట్‌... బాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్‌

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో