ఎంబీఏ వ్యాపారానికి.. పాదయాత్ర రాజకీయానికి: ఐటీ మంత్రి నారా లోకేష్


Send us your feedback to audioarticles@vaarta.com


అమెరికాలో చదువుకున్న ఓ వ్యక్తి. చిన్నప్పట్నుంచి ఓ రిచ్ లైఫ్ స్టయిల్ చూసిన ఓ వ్యక్తి, జన బాహుళ్యంలోకి రాగలడా? నిత్యం విమర్శలు-ప్రతివిమర్శలతో సాగే రాజకీయాల్లో రాణించగలడా? తలుచుకునే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.
కావాలనుకుంటే ఏదైనా వ్యాపారం చేయొచ్చు. కుటుంబ వ్యాపారాన్నే కొనసాగించొచ్చు. కానీ నారా లోకేష్ మాత్రం తండ్రి బాటలో నడవాలనుకున్నారు. రాజకీయాల్లో రాణించాలనుకున్నారు. ప్రస్తుతం తనదైన ముద్రతో దూసుకుపోతున్నారు. ఇదంతా ఓవర్ నైట్ లో అవ్వలేదు. దీని వెనక ఎంతో కష్టం-కృషి ఉంది.
"స్టాన్ ఫర్డ్ లో చేసిన ఎంబీఏ బిజినెస్ కు పనికొచ్చింది. చేసిన పాదయాత్ర రాజకీయాలకు చాలా ముఖ్యం. 3వేల కిలోమీటర్ల పాదయాత్ర వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. రాష్ట్ర పరిస్థితుల్ని మరింత లోతుగా అర్థం చేసుకున్నాను. సమస్యల్ని దగ్గరుండి చూశాను."
అందరికంటే ముందే టెక్నాలజీ గురించి, ఐటీ గురించి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఐటీ దాటి ఏఐ వచ్చింది. అదే విధంగా చంద్రబాబు తర్వాత నారా లోకేష్ వచ్చారు. మరి తండ్రికి తగ్గ వారసుడిగా లోకేష్ రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు?
"విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుచేయబోతున్నాం. ఇందులో మరో ఆలోచనకు తావులేదు. వై2కే విప్లవంతో భారత్, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లబ్ది పొందాయి. ఈ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఐటీలో మరో విప్లవం రెడీ అయింది. ఏఐ అనే విప్లవాన్ని అందుకోడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో నాణ్యమైన మానవ వనరులున్నాయి. ఈజీగా వ్యాపారం చేసుకోవాడానికి అనువైన ఎకో సిస్టమ్ ఉంది. అవకాశాల్ని అందుకునే సరైన టైమ్ లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉంది."
ఈ దిశగా ఇప్పటికే మన మిత్ర పేరిట వాట్సాప్ సేవల్ని ప్రారంభించారు లోకేష్. 200 ప్రభుత్వ సేవల్ని అందులో అందుబాటులోకి తెచ్చారు. ఇంట్లో కూర్చొని ఆ సేవల్ని అందుకోవచ్చు. ప్రస్తుతం 20 లక్షల మంది వినియోగదారులున్నారు.
ఇలా పార్టీలో ఎంతలా తనదైన ముద్ర వేసినా, తను మాత్రం ఇప్పటికీ ఓ కార్యకర్తలానే పనిచేస్తానని అన్నారు. ఎందుకంటే, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఏదైనా తప్పు జరిగితే చంద్రబాబు అసహనాన్ని ముందుగా చవిచూసేది తానేనని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com