స‌ల్మాన్ ఖాన్‌పై మీటూ ఆరోప‌ణ‌లు

  • IndiaGlitz, [Monday,April 22 2019]

దేశ వ్యాప్తంగా మీటూ ఉద్య‌మం ఉధృతంగా జ‌రిగి ఇప్పుడిప్పుడే అస‌లు విష‌యం సైలెంట్ అవుతుంది. ఇలాంటి త‌రుణంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్ట్‌టెంట్ పూజా మిశ్రా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. పూజా మిశ్రా చేసిన ఆరోప‌ణ‌ల‌పై టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. స‌ల్మాన్‌ఖాన్‌తో పాటు అత‌ని సోద‌రులు సొహైల్ ఖాన్‌, అర్భాజ్ ఖాన్ కూడా త‌న‌పై అత్యాచారం చేశార‌ని తెలిపింది. అలాగే సీనియ‌ర్ న‌టుడు శ‌తృఘ్న సిన్హాపై కూడా పూజా మిశ్రా ఆరోప‌ణ‌లు చేసింది.

ఆయ‌న త‌న ల్యాప్ టాప్‌, ఫోన్‌ను ట్యాప్ చేసి త‌న క్రియేటివ్ ఐడియాల‌ను దొంగిలించాడ‌ని .. ఆ ఐడియాల‌ను సోనాక్షిసిన్హా, మ‌లైకా ఆరోరా ఖాన్‌ల కెరీర్‌ను బాగు చేయ‌డానికి ఉప‌యోగించాడ‌ని తెలిపింది. అంతే కాకుండా శ‌తృఘ్న సిన్హా భార్య త‌న‌పై చేత‌బ‌డి కూడా చేశార‌ని అన్నారు. శ‌తృఘ్న సిన్హా విష‌యాన్ని ప‌క్క‌న ప‌డితే.. స‌ల్మాన్‌ఖాన్‌పై పూజా మిశ్రా చేసిన ఆరోప‌ణ‌లు ఎంత దూరం వెళ‌తాయో తెలియ‌డం లేదు.