మీడియా జీవితాల్ని నాశనం చేసింది - పూరి జగన్నాథ్

  • IndiaGlitz, [Thursday,July 20 2017]

డ్ర‌గ్స్ కేసులో సిట్ అధికారుల ముందు హాజ‌ర‌య్యారు పూరి జ‌గ‌న్నాథ్‌. 11 గంట‌ల పాటు విచార‌ణ సాగింది. విచార‌ణ అనంతరం పూరి జ‌గ‌న్నాథ్‌, ఎవ‌రితో మాట్లాడ‌కుండా ఇల్లు చేరుకున్నాడు. అనంతరం ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పూరి త‌న అభిప్రాయాల‌ను తెలియ‌జేశారు. సిట్ అధికారుకు పూర్తిగా స‌హ‌క‌రించాను. నేను బాధ్య‌త గ‌ల వ్య‌క్తిని. అసాంఘిక కార్య‌క‌లాపాల‌ను ఎప్ప‌టికీ చేయ‌ను. డగ్స్ అయినా, మ‌రేదైనా కావ‌చ్చు. సిట్ అధికారులు మ‌ళ్ళీ ర‌మ్మన్నా కూడా వెళ్ల‌డానికి నేను సిద్ధంగా ఉన్నాను.

నాకు పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే ఎంతో గౌర‌వం. వారిపై ఎన్నో సినిమాలు తీశాను. అలాగే జ‌ర్న‌లిస్టుల‌న్నా నాకెంతో ఇష్టం. వారిపై ప్రేమ‌తో ఇజం సినిమా తీశాను. జ‌ర్న‌లిస్ట్ మిత్రుల‌ను వ‌న్ టు వ‌న్ క‌లుస్తుంటాను. వారితో కాఫీ తాగుతూ మాట్లాడుతుంటాను. అంత క్లోజ్‌గా ఉండేవారు. కానీ స‌మ‌యం రాగానే..నాపై నిజం ఏంటో తెలియ‌క‌పోయినా అర్ధ‌గంట స్టోరీలు రాసేశారు. మా అమ్మ‌, భార్య‌, పిల్ల‌లు, అన్న‌ద‌మ్ములు అంద‌రూ ఏడుస్తున్నారు. నేనే కాదు, చాలా మంది ఫ్యామిలీలు అలాగే ఉన్నాయి. మీడియాపై బాధ‌గా ఉంది. రేపు మ‌ళ్ళీ క‌లుస్తాం. కానీ చాలా డిస్ట్ర‌బ్ చేసింది. ఏదైనా ఉంటే రేపు సిట్ ఆఫీస‌ర్లు డిసైడ్ చేస్తారు అంటూ పూరి తెలిపారు.

More News

'శమంతకమణి' సక్సెస్ తో భవ్య క్రియేషన్స్ తో ఓ మెట్టు ఎదిగింది - నిర్మాత వి.ఆనంద ప్రసాద్

నారారోహిత్, సందీప్కిషన్, సుధీర్బాబు, ఆది హీరోలుగా భవ్య క్రియేషన్స్ బ్యానర్పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం 'శమంతకమణి'.

నలుగురు హీరోలతో నటించాను - తాప్సీ

70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తాప్సీ పన్ను, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, , షకలక శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం `ఆనందో బ్రహ్మ`. మహి వి.రాఘవ్ దర్శకుడు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు.

రాణాతో ఫోటో దిగడం ఇప్పుడు చాలా ఈజీ

స్టార్లతో ఫోటోలు దిగడానికి సగటు సినిమా అభిమానులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కానీ.. ఇకపై స్టార్ హీరోతో ఫోటో దిగడం సులభతరం చేసింది యాప్ స్టర్. "నేనే రాజు నేనే మంత్రి" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.

ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా టీమ్-5 విడుదల

భారత జాతీయ క్రికెటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్, ఇప్పుడు టీమ్-5 అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కానున్నాడు. సురేష్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న టీమ్-5 చిత్రంలో కన్నడ భామ నిక్కీ గర్లాని కథానాయికగా నటిస్తోంది.

బృందావనమది అందరిది మూవీ తో దర్శకుడిగా మారుతున్న రచయిత శ్రీధర్ సీపాన

పలు సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారబోతున్నారు. నూతన నటీనటులతో ఆయన తన తొలి సినిమాను రూపొందించనున్నారు. ఈ చిత్రానికి బృందావనమది అందరిది అనే టైటిల్ ను ఖరారు చేశారు.