హీరోకి తల్లి పాత్రలో మీనా

  • IndiaGlitz, [Saturday,December 23 2017]

తొలుత బాల‌న‌టిగా తెరంగేట్రం చేసి.. త‌రువాత కాలంలో క‌థానాయిక‌గానూ రాణించారు మీనా. సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, చంటి, సుంద‌ర‌కాండ‌, అబ్బాయిగారు, బొబ్బిలి సింహం..ఇలా ప‌లు చిత్రాల్లో ఆమె క‌థానాయిక‌గా అల‌రించారు. ఇటీవ‌ల దృశ్యం చిత్రంలో ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌కి త‌ల్లిగా.. వెంక‌టేష్‌కి జోడీగా సంద‌డి చేశారు. కాగా, ప్ర‌స్తుతం మీనా సాక్ష్యం అనే చిత్రంలో న‌టిస్తున్నారు. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, పూజా హెగ్డే జంట‌గా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మీనా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఇందులో మీనా క‌థానాయ‌కుడు శ్రీ‌నివాస్‌కి త‌ల్లి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్ కుమార్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదివ‌ర‌కు మీనా.. బెల్లంకొండ సురేష్ నిర్మించిన మా అన్న‌య్య చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించారు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు శ్రీ‌నివాస్ న‌టిస్తున్న చిత్రంలో ఆమె త‌ల్లి పాత్ర‌లో సంద‌డి చేయ‌నుండ‌డం విశేషం.

More News

శ్రీను వైట్ల చిత్రంలో..

హాస్య నటుడిగా కెరీర్ ని ప్రారంభించి..క్రమంగా కథానాయకుడి పాత్రలవైపు అడుగులు వేశారు సునీల్.

'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రాన్ని వీక్షించిన పార్లమెంట్ సభ్యులు

'సప్తగిరి ఎక్స్ ప్రెస్'వంటి సూపర్హిట్ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'

'ఇగో' ఆడియో విడుదల

'ఆకతాయి'ఫేమ్ ఆశిష్ రాజ్,సిమ్రాన్ జంటగా రూపొందుతోన్న సినిమా 'ఇగో'.

'బేవర్స్' చిత్రం టీజర్ గ్రాండ్ లాంచ్

'ఆనలుగురు','మీ శ్రేయాభిలాషి'లాంటి గర్వించదగ్గ చిత్రాల్లొ నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని రెండింతలు సొంతం చేసుకున్న నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం బేవర్స్.

'స్టూడెంట్ పవర్' ఆడియో ఆవిష్కరణ

కృష్ణ,పూర్ణి హీరో,హీరోయిన్ల గా నటిస్తోన్న చిత్రం `స్టూడెంట్ పవర్'.సత్యాసాయికృష్ణ క్రియేషన్స్ పతాకంపై వి.కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.వి.రాజ్ కమల్ సమర్పకుడు