'దృశ్యం 2' సెట్స్‌లో జాయిన్ అయిన మీనా

  • IndiaGlitz, [Tuesday,March 16 2021]

‘దృశ్యం’ సినిమా సింపుల్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మలయాళం రీమేక్ అయిన ఈ సినిమా.. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కింది. థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మలయాళం ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది. ఒక సక్సెస్ సాధించిన చిత్రానికి సీక్వెల్ అంటే మామూలు విషయం కాదు.. ఏమాత్రం అటు ఇటు అయినా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంది. కానీ ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌ను దర్శకుడు జీతూ జోసెఫ్‌ టాకిల్ చేసిన తీరు అద్భుతం. ‘దృశ్యం’ సినిమాకు మించి ‘దృశ్యం 2’ ఆకట్టుకుందనడంలో సందేహం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. తొలి భాగంలో హీరో హీరోయిన్లుగా నటించిన వెంకటేష్, మీనాయే సీక్వెల్‌లో కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ మీనా సెట్స్‌లో జాయిన్ అయ్యారు. సోమవారం నుంచే ఆమె రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ‘‘స్టార్ట్‌ రోలింగ్‌.. ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాను’’ అని మీనా వెల్లడించారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ సీక్వెల్‌కు సైతం జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించనున్నారు. రాంబాబు పాత్రలో వెంకటేశ్ తిరిగి మెప్పించనున్నారు. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే మరో ఇంట్రస్టింగ్ విషయం ఉంది.

ఈ సినిమాలో బాబాయి, అబ్బాయి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని టాక్. మలయాళంలో ఈ చిత్రంలో సురేష్ గోపి నటించిన కొత్త ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో రానా నటించబోతున్నాడని టాలీవుడ్ టాక్. ‘దృశ్యం’ సినిమా చూసిన వారెవ్వరూ దాని కథను మరచిపోలేరు. ఈ సినిమాలో ఓ యువకుడు వెంకటేష్ కూతురిని వేధించి, ఆయన చేతిలోనే హత్యకు గురవుతాడు. ఆ హత్య చేసింది ఎవరో పోలీసులు తెలుసుకోలేకపోతారు. చివరికి కేసు క్లోజ్‌ అయిపోతుంది. ‘దృశ్యం 2’లో కొత్త ఇన్‌స్పెక్టర్‌ చార్జ్‌ తీసుకున్నాక కేసుని రీ ఓపెన్‌ చేస్తారు. మళ్లీ అమ్మాయి తండ్రి రాంబాబు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్‌లు మొదలుపెడతాడు. అద్భుతమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.

More News

'స‌లార్‌'లో కేజీయ‌ఫ్ స్టార్‌..!

ఇద్ద‌రు ప్యాన్ ఇండియా స్టార్స్ క‌లిసి సినిమా చేస్తుంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఈ సినిమా కోసమే ఎదురుచూస్తుంటుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

ప‌వ‌ర్‌స్టార్ కోసం జాన‌ప‌ద రైట‌ర్‌..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌తున్న ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ సినిమాతో పాటు సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న సాయిప‌ల్ల‌వి చెల్లెలు..!

డాక్ట‌ర్ చ‌దివి యాక్ట‌ర్‌గా మారిన వారిలో సాయిప‌ల్ల‌వి ఒక‌టి. వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకుంది సాయిప‌ల్ల‌వి.

అఖిల్ సినిమాలో మోహన్‌లాల్‌.. హాలీవుడ్ స్ఫూర్తితో..?

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

చంద్రబాబు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఏపీ సీఐడీ అధికారులు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.