close
Choose your channels

'సలార్ ’లో ప్రభాస్‌కు జోడిగా రవితేజ హీరోయిన్..?

Wednesday, October 13, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాన్‌ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్‌’. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అన్ని మాస్ ఎలిమెంట్స్ వుండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. దీనిలో భాగంగానే ఓ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ వేయించాలని భావిస్తున్నారు. ఇందుకోసం శ్రీనిధి శెట్టి, శ్రద్ధా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచార ప్రకారం.. ‘ఖిలాడీ’ భామ మీనాక్షి చౌదరిని దాదాపు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . సలార్‌లో శ్రుతితో పాటు మరో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యముందని, ఆ క్యారెక్టర్ కోసమే మీనాక్షిని తీసుకున్నారని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో జరగనున్న కొత్త షెడ్యూల్‌లోనే ఆమె చిత్ర యూనిట్‌తో కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సలార్‌ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రూర్‌ స్వరాలందిస్తున్నారు.

మరోవైపు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమాను పూర్తి చేసారు. ఈ చిత్రాన్ని జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత ఒకేసారి ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్’ మూవీతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నారు. ఇది కూడా ఫినిషింగ్ స్టేజ్‌కొచ్చింది. దాంతో పాటు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్ట్ K... సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు ప్రభాస్ ప్రకటించారు. వీటితో పాటు బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్‌, మహిళా దర్శకురాలు సుధ కొంగరతో ప్రభాస్ సినిమాలు చేస్తారని ఫిలింనగర్‌ టాక్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.