'సలార్ ’లో ప్రభాస్‌కు జోడిగా రవితేజ హీరోయిన్..?

  • IndiaGlitz, [Wednesday,October 13 2021]

పాన్‌ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్‌’. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అన్ని మాస్ ఎలిమెంట్స్ వుండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. దీనిలో భాగంగానే ఓ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ వేయించాలని భావిస్తున్నారు. ఇందుకోసం శ్రీనిధి శెట్టి, శ్రద్ధా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచార ప్రకారం.. ‘ఖిలాడీ’ భామ మీనాక్షి చౌదరిని దాదాపు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . సలార్‌లో శ్రుతితో పాటు మరో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యముందని, ఆ క్యారెక్టర్ కోసమే మీనాక్షిని తీసుకున్నారని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో జరగనున్న కొత్త షెడ్యూల్‌లోనే ఆమె చిత్ర యూనిట్‌తో కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సలార్‌ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రూర్‌ స్వరాలందిస్తున్నారు.

మరోవైపు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమాను పూర్తి చేసారు. ఈ చిత్రాన్ని జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా తర్వాత ఒకేసారి ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్’ మూవీతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నారు. ఇది కూడా ఫినిషింగ్ స్టేజ్‌కొచ్చింది. దాంతో పాటు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్ట్ K... సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు ప్రభాస్ ప్రకటించారు. వీటితో పాటు బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్‌, మహిళా దర్శకురాలు సుధ కొంగరతో ప్రభాస్ సినిమాలు చేస్తారని ఫిలింనగర్‌ టాక్.

More News

సమంతతో నా రిలేషన్ చైతూకు తెలుసు.. ఆయన ఒక్క స్టేట్‌మెంట్‌ ఇస్తే చాలు..: ప్రీతమ్‌ జుకల్కర్‌

టాలీవుడ్ స్టార్ కపుల్‌ అక్కినేని నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

మా ఎన్నికలు: ‘‘ రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా ’’... ఓటమిపై అనసూయ సంచలన ట్వీట్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఫిలింనగర్‌లో వేడి చల్లారలేదు.

జీన్స్ ప్యాంట్ ఒకటే పైన నూలుపోగు లేదు.. టాప్‌ లెస్‌ ఫోటోలతో సెగలు రేపుతోన్న ఈషా

ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే ఆలోచన ఇప్పటి మోడల్స్, హీరోయిన్లు శృతి మించుతున్నారు.

విశ్వాకు యానీ మాస్టర్ వార్నింగ్.. ప్రియా సెటైర్లు, ఈ వారం నామినేషన్స్‌లో వీరే

బిగ్‌బాస్ 5 విజయవంతంగా ఆరో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు ఐదు వారాలు పూర్తయ్యాయి.

రాగద్వేషాలలో చిక్కుకున్న రెండు జంటల కథ 'అగ్నిపరీక్ష'

రెండు జంటల మధ్య మంట రేపిన ప్రేమ… పగను మరియు మనసులలో దాగున్న ద్వేషాన్ని తొలిగించగల్గుతుందా?