మహిళ కమిషన్‌కు మీరా వ్యవహారం.. ఎన్టీఆర్‌కు తలనొప్పి!

  • IndiaGlitz, [Thursday,June 04 2020]

అభిమానుల అత్యుత్సాహం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇష్టమని.. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని మీరా చెప్పడమే పెద్ద మిస్టేక్.! ఈ ఒక్క మాటను పట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ మీరాను దుమ్మెత్తి పోస్తున్నారు. తీవ్ర అసభ్య పదజాలంతో మెసేజ్‌లు చేయడం.. కొందరు అభిమానులు అయితే ఏకంగా చంపేస్తామని బెదిరించడం, గ్యాంగ్ రేప్ చేస్తామని ఈ విషయాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను జోడిస్తూ పోలీసులకు మీరా ఫిర్యాదు చేసింది.

సీన్ మారుతోంది..!

ఇప్పుడీ వ్యవహారం జాతీయ మహిళా కమిషన్ దాకా వెళ్లింది. కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ స్పందించారు. జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు ఈ విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. అంతేకాకుండా ఈ సందేశాలన్నింటినీ.. అభ్యంతరకరమైన ట్వీట్స్ అన్నీ తొలగించాలని ట్విట్టర్ ఇండియాను కోరినట్లుగా కూడా రేఖా శర్మ ట్విట్టర్‌లో తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్టును కూడా జతచేశారు. అయితే ఈ ట్వీట్‌పై కూడా కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. రోజు రోజుకూ ఈ వివాదం ముదురుతోందే తప్ప.. ఫుల్ స్టాప్ పడే సీన్ మాత్రం కనిపించట్లేదు.

మొత్తానికి చూస్తే.. అభిమానుల అత్యుత్సాహం ఎన్టీఆర్‌కు పెద్ద తలనొప్పిగానే మారింది. అభిమానులను ఏమీ చెప్పలేక.. అటు మీరా చోప్రాకూ ఏమీ రిప్లయ్ ఇవ్వలేక యంగ్ టైగర్ చాలా మదనపడుతున్నారని తెలియవచ్చింది. ఫైనల్‌గా ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో.. ఎన్టీఆర్ ఏం చెబుతారో వేచి చూడాల్సిందే.

More News

హగ్, కిస్, ఫైట్స్ లేకుండా షూటింగ్స్‌కు ఓకే..!

కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్స్ మూసివేయడంతో ఇండస్ట్రీకి ఏ రేంజ్‌లో నష్టం వాటిల్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

సోషల్ మీడియా యూజర్స్‌కు ఏపీ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్

సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదని.. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని యూజర్స్‌కు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

షాకింగ్ : మహబూబ్ నగర్‌లో పచ్చడితో కరోనా!

వేసవికాలం వచ్చిందంటే అవకాయ పచ్చడి పెట్టుకోని తెలుగువారు ఉండరు.. అన్నంలోకి ఆవకాయ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. ఇప్పుడంతా కరోనా

థియేటర్స్ ఓపెనింగ్స్‌పై కేంద్రం నిర్ణయం ఇదీ..

కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్స్ మూసివేయడంతో ఇండస్ట్రీకి ఏ రేంజ్‌లో నష్టం వాటిల్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

కరోనా పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పాటలో హీరో నిఖిల్

కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్ దేశాలు శక్తీ మేర కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుంది.