మీరా వ‌ర్సెస్ స‌మీరా

  • IndiaGlitz, [Monday,June 11 2018]

ఈ వారం రెండు ప్రేమ‌క‌థా చిత్రాలు తెలుగు తెర‌పై సంద‌డి చేయ‌బోతున్నాయి. ఆ సినిమాలే.. నా నువ్వే, స‌మ్మోహ‌నం. క‌ళ్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నా నువ్వే ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా.. సుధీర్ బాబు, అదితి రావ్ హైద‌రీ హీరోహీరోయిన్లుగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన స‌మ్మోహ‌నం ఈ నెల 15న రిలీజ్ కాబోతోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ క‌థానాయిక‌ల పాత్ర‌లు సెల‌బ్రిటీలు కావ‌డంతో పాటు పేర్లు కూడా ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం. నా నువ్వే విష‌యానికి వ‌స్తే.. త‌మ‌న్నా పాపుల‌ర్ రేడియో జాకీగా మీరా పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

ఇక స‌మ్మోహ‌నం విష‌యానికి వ‌స్తే.. అదితి రావ్ హైద‌రీ సినిమా హీరోయిన్ స‌మీరా పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. మ‌రి.. మీరా, స‌మీరా పాత్ర‌ల్లో ఏ పాత్ర‌కి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.

More News

వ‌ర్మ కొత్త చిత్రం

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. రీసెంట్‌గా నాగార్జున‌, వ‌ర్మ చేసిన 'ఆఫీస‌ర్‌' డిజాస్ట‌ర్ అయ్యింది.

రాజ‌మౌళిని కూడా లైన్‌లో పెట్టిన సంస్థ‌

'బాహుబ‌లి' స‌క్సెస్‌తో రాజ‌మౌళి ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కి ఎదిగారు. ఇప్పుడు ఆయ‌నతో సినిమాలు చేయాల‌ని ఇటు స్టార్ హీరోలు, అటు ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లు క్యూ క‌డుతున్నాయి.

స్టార్ హీరోకి ఫిదా అయిన హీరోయిన్‌...

అమీ తుమీ, అ! చిత్రాల్లో న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న న‌టి 'ఈషా రెబ్బా'. ఇప్పుడు 'అర‌వింద స‌మేత‌...' చిత్రంలో ఎన్టీఆర్ జ‌త‌గా న‌టిస్తుంది.

నిన్న చిరు.. నేడు మ‌హేష్‌.. రేపు తార‌క్‌

త‌మ కుటుంబ స‌భ్యుల ఆడియో వేడుక‌ల‌కి, ముంద‌స్తు విడుద‌ల వేడుక‌కు.. అదే కుటుంబానికి చెందిన స్టార్స్ రావ‌డం కొత్తేమీ కాదు.

మనం సైతం సేవా కార్యక్రమాలు నన్ను కదిలించాయి - నాని

మనం సైతం సేవా కార్యక్రమాలు తనను భావోద్వేగానికి గురిచేశాయన్నారు నేచురల్ స్టార్ నాని. ఈ సేవా సంస్థ అందిస్తున్న సహాయం మనసును కదిలించిందని ఆయన అన్నారు.