పవన్‌ను కలవడం నా లైఫ్‌లో హ్యాపీ మూమెంట్!

  • IndiaGlitz, [Monday,February 24 2020]

టాలీవుడ్ కుర్ర హీరో నితిన్, రష్మిక మందన్నా నటీనటులుగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘భీష్మ’ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భీష్మ’ కలెక్షన్ల పరంగా గట్టిగానే దూసుకెళ్తున్నాడు. వాస్తవానికి సినిమా పోస్టర్లు, లుక్స్, టీజర్లతోనే అంచనాలు పెరిగిపోయాయ్.. అయితే.. ఈ సినిమాను చాలా సీరియస్‌గా తీసుకున్న నితిన్.. అనుకున్నట్లుగానే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు ఈ సినిమా బాగుందని కితాబిచ్చారు. అయితే తాజాగా.. ఈ చిత్ర బృందానికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ను కలిసిన విషయాన్ని భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. మరోవైపు నితిన్ కూడా ఈ ఫొటోలను షేర్ చేశాడు. నితిన్‌.. పవన్ భక్తుడు అన్న విషయం తెలిసిందే.

లైఫ్‌లో హ్యాపీ మూమెంట్ ఇదీ!

‘నా జీవితంలో అత్యంత సంతోషాన్నిచ్చే మూమెంట్ ఇది. పవర్‌స్టార్ పవన్‌ భీష్మ చిత్రం సక్సెస్ సాధించినందుకు ఆయన అభినందనలు తెలిపారు’ వెంకీ కుడుముల అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు పవన్‌ను కలిసినట్లున్న ఫొటోలను ఆయన షేర్ చేశాడు. ఈ ట్వీట్‌కు పవన్ వీరాభిమానులు, నితిన్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.

More News

ట్రంప్ పర్యటన: అలా జరగదనే ఆశిస్తున్నా: ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూటే సపరేటు.. నేనింతే.. అంటూ ప్రవర్తిస్తుంటారు.

ఈ ఉగాది కి zee5 తమ ప్రేక్షకులందరికీ షడ్రుచుల అమృతాన్ని ఒడ్డించబోతుంది ‘అమృతం ద్వితీయం’

భారత దేశపు అతి పెద్ద   కాంటెక్ టెక్నాలజీ బ్రాండ్ అయిన zee5 నెటవర్క్ ప్రేక్షకులకి ఎల్లప్పుడూ ఉన్నత కంటెంట్ ను అందించడంలో ముందంజలో ఉంటుంది.

ట్రంప్ ‘పసుపు టై’.. మెలానియా ‘వస్త్రం’ స్పెషాలిటీ ఇదీ..

అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఇండియాకు విచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ట్రంప్ కట్టుకున్న ‘పసుపు టై’,

నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్'

నాచురల్ స్టార్ 'నాని' హీరోగా 'జెర్సీ' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన ఉత్తమ కధా చిత్ర్రాన్ని నిర్మించిన యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ

నితిన్ భీష్మ స‌క్సెస్‌... పెళ్లిపై బ‌న్నీ కామెంట్స్‌

ఇద్ద‌రికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. బిడ్డొచ్చిన వేళ‌.. గొడ్డొచ్చిన వేళ అనే సామెత వినే ఉంటాం .. అలా ఇప్పుడు నితిన్ ప‌రిస్థితి త‌యారైంది.