అప్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్ - 2017

  • IndiaGlitz, [Thursday,June 15 2017]

మెగాస్టార్ చిరంజీవి 40 సంవత్సరాల సినిమా సేవలను కొనియాడుతూ చిరంజీవి రక్తదాన సేవలకు సంఘీభావాన్ని తెలుపుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రానున్న 40 రోజుల్లో 40 రక్తదాన శిబిరాలను నిర్వహించాలని విజయ్ రేపల్లె గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వర్జీనియా రాష్ట్రంలోని స్టెర్లింగ్ నగరం ఇనోవా హాస్పిటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చిరంజీవి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది దాతలు ర‌క్త‌దానం చేశారు.

అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఇనోవా బ్లడ్ డొనేషన్స్ స్టెర్లింగ్ హాస్పిటల్స్ మేనేజర్ AJ చిరంజీవి బ్లడ్ బ్యాంకు గురించి ప్రస్తావించి, బ్ల‌డ్ బ్యాంక్ సేవలను కొనియాడారు. ఈ స‌మ‌యంలో చిరంజీవి అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం మ‌రింత రెట్టింపయ్యిందని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయ్ రేపల్లె గారు అమెరికాలోని ఆప్త సంస్థ ఆధ్వర్యంలో అక్కడున్న చిరంజీవి అభిమానుల సహాయంతో కుటుంబ కార్యక్రమంగా నిర్వహించడంతో అధిక శాతం మహిళలు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదే వేదిక‌పై అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.

More News

'శమంతకమణి' టీజర్ విడుదల

నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్, డా. రాజేంద్రప్రసాద్, ఇంద్రజ కీలకపాత్రల్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం `శమంతకమణి`. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.

'విఠలాచార్య' షురూ..

విఠలాచార్య చాలా గొప్పదర్శకులు.ఆయన పేరుతో సినిమా స్టార్ట్ చేయడం బావుంది.

కోలీవుడ్ లో రాజశేఖర్ కుమార్తె...

రాజశేఖర్ దంపతుల మొదటి కుమార్తె శివాని త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయనుందనే వార్తలు వస్తున్నాయి. శివాని ప్రస్తుతం ఎం.బి.బి.ఎస్ మూడో ఏడాది చదువుతుంది. త్వరలోనే తెరంగేట్రం చేయనున్న శివాని తెలుగులో తేజ దర్శకత్వంలో నటిస్తుందని అన్నారు.

ఎన్టీఆర్ సాంగ్ రీమిక్స్ చేస్తున్న బాలయ్య..

స్టార్ హీరోల సాంగ్స్ ను వారి వారసులు రీమిక్స్ చేయడం సర్వసాధారణ విషయమైంది.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఎప్పుడంటే...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం జై లవకుశ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.