తల్లి పుట్టినరోజు సందర్భంగా సింగిల్ ఫ్రేమ్‌లోకి మెగా బ్రదర్స్..

తల్లి పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సింగిల్ ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. నేడు మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ల తల్లి అంజనా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా అన్నదమ్ములతో పాటు సోదరిలు సైతం వచ్చి తమ తల్లి పుట్టినరోజు వేడుకను జరిపించారు. అంజనాదేవితో కలిసి కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు తీసుకున్న పిక్‌ను నాగబాబు ఇన్‌స్టా గ్రాంలో షేర్ చేశారు. ఈ ఫోటోను చూసి అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. కొందరు అనంతమైన ఆనందాన్నిస్తారని.. కొన్ని సందర్భాలు ఆనందంగా జరుపుకునేవి ఉంటాయంటూ మెగా బ్రదర్ పోస్టులో పేర్కొన్నారు. ‘‘కొందరు ఎప్పటికీ తరగనంత ఆనందాన్నిస్తారు. ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే క్షణాలు కొన్ని ఉంటాయి. కానీ మేము ఇంతటి సంతోషకరమైన క్షణాలను గడపడానికి కారణం నువ్వే.. నీ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసే క్షణాల్లో మాత్రం మాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉంటుంది అమ్మ’’ అంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు.

చిరు కూడా తమ తల్లి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆకట్టుకుంటోంది. అంజనీ దేవి తన ముగ్గురు కుమారులు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లతో ఉన్న ఫోటోలను ప్రముఖంగా.. అలాగే తన కూతుళ్లు మనవళ్లు, మనవరాళ్లతో చాలా ఆనందంగా ఉన్న ఫోటోలతో అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఒక వీడియోను క్రియేట్ చేశారు. ఆ వీడియోను చిరు ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. తన తల్లిపై తనకున్న ప్రేమాభిమానాలను చిరు ఆ వీడియో ద్వారా వ్యక్తపరిచారు. మెగా అభిమానులు సైతం చిరు తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

More News

తల్లి పుట్టినరోజు సందర్భంగా చిరు ఎమోషనల్ పోస్ట్

అమ్మ అనే పదంలోనే కమ్మదనం ఉంది. అది సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ తల్లి అంటే ఉండే మమకారం అంతా ఇంతా కాదు.

ఢిల్లీ : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు

దేశ రాజధాని ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు జరిగింది.

‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ రిలీజ్ ఫిక్స్

తొంద‌ర‌ప‌డితే చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌లేం..ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం.. ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు రాకీభాయ్‌..

ట్రెమెండస్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తోన్న మెగాస్టార్ 'ఆచార్య' టీజర్

'ఆచార్య దేవో భవ' అని మన అందరికీ తెలిసిందే.. కానీ 'ఆచార్య రక్షోభవ' అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరం: కోవింద్

పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి నేడు రాష్ట్రపతి కోవింద్‌ ప్రసంగించారు.