close
Choose your channels

జాతీయ అవార్డు విజేతలకు మెగా బ్రదర్స్ అభినందనలు

Friday, August 9, 2019 • తెలుగు Comments

జాతీయ అవార్డు విజేతలకు మెగా బ్రదర్స్ అభినందనలు

జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ ఎంపికైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మూవీ ‘మహానటి’ చిత్రంలో కీర్తి సురేశ్ అద్భుత నటనకు గాను ఆమెను ఈ పురస్కారం వరించింది. అంతేకాదు.. తెలుగు ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ‘మహానటి’ ఎంపికైంది. ఇదే చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ పురస్కారం దక్కడం విశేషం. ఈ సందర్భంగా నటి కీర్తి సురేశ్ ను అభినందిస్తూ పలువురు సినీ ప్రముఖులు సందేశాలు పంపారు.

చిరు స్పందన..!
కాగా అవార్డులు పొందిన వారికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ‘మ‌హాన‌టి’, ‘రంగ‌స్థలం’ చిత్రాల‌కు జాతీయ అవార్డలు వ‌స్తాయ‌ని రిలీజ్‌కు ముందే చిరు చెప్పిన విషయం విదితమే. ‘మ‌హాన‌టి’ విడుదల అనంతరం చిత్రబృందం తన ఇంటికి పిలిచి సన్మానించారు. నాడు చిరు చెప్పినట్లుగానే ఈ రెండు చిత్రాలకు అవార్డులు దక్కడం విశేషమే. దీంతో చిరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ అవార్డులపై తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

ఇదే స్పూర్తితో మరెన్నో రావాలి!
"జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైన కీర్తి సురేష్ గారికి నా తరఫున, జన సైనికుల తరఫున అభినందనలు. సావిత్రి గారి జీవితం ఆధారంగా వచ్చిన ‘మహానటి’లో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేష్ గారి నటన అవార్డుకు అర్హమైనదే. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి నిలిచినందున చిత్ర బృందానికి, రంగస్థలం, అ!, చి.ల.సౌ., చిత్రాలకు సాంకేతిక విభాగాల్లో అవార్డులకు ఎంపికైనవారికి అభినందనలు. ఏడు పురస్కారాలు దక్కించుకున్నందున ఈ స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలి" అని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.

Get Breaking News Alerts From IndiaGlitz