మెగా ఫ్యాన్స్ కోరిక నేర‌వేరేనా?

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు రెండు పెద్ద కోరిక‌లు మిగిలిపోయాయి. అవేంటంటే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించ‌డం, మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనూ చిరంజీవి న‌టించ‌డం. ఇందులో రాజ‌మౌళి సినిమాలో అంటే .. మ‌గ‌ధీర‌లో చిన్న అతిథి పాత్ర‌లో అయినా క‌నిపించారు. కానీ ఇంత వ‌ర‌కు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు సినిమా తెర‌కెక్క‌నేలేదు. మెగాఫ్యాన్స్ కూడా శంక‌ర్ వంటి స్టార్ డైరెక్ట‌ర్‌తో చిరు సినిమా చేయాల‌ని బ‌లంగా కోరుకున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ కోరిక తీర‌నే లేదు. అయితే త్వ‌ర‌లోనే ఆ కోరిక తీర‌నుంద‌ని స‌మాచారం.

సోష‌ల్ మీడియా వ‌ర్గాల్లో విన‌ప‌డుతోన్న స‌మాచారం మేర‌కు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి సినిమా చేయ‌బోతున్నార‌ట‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఇండియ‌న్ 2 సినిమా ఆగిపోయింది. ఈ నేప‌థ్యంలో ఈ స్టార్ డైరెక్ట‌ర్ చిరంజీవితో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం దీనికి సంబంధిచిన చ‌ర్చ‌లు ప్రారంభ ద‌శ‌లో ఉన్నాయ‌ని అవ‌న్నీ ఓ కార్య‌రూపంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌నే అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. శంక‌ర్‌తో సినిమా అంటే చాలా భారీ లెవ‌ల్లో ఉంటుంది. మ‌రి ఆ భారీ రేంజ్‌లో మ‌న‌వాళ్లు చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం ఉందా? అస‌లు ఈ వార్త‌ల్లో నిజా నిజాలెంత‌? అనే విష‌యాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం.. జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఇవాళ తెల్లారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గోపాలపట్నం వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్యాస్ లీకయ్యింది.

మద్యం అమ్మకాల్లో ఆంధ్రా రికార్డ్ బద్ధలు కొట్టిన తెలంగాణ!

లాక్ డౌన్ 3.0 విధించిన అనంతరం కేంద్రం కొన్ని సడలింపులు చేసిన విషయం విదితమే. ఇందులో మద్యం అమ్మకాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలో

ఏపీ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లోని పాలనా యంత్రాంగంలో కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టూరు. ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకుని సీఎంగా

మ‌రోసారి పాక‌శాస్త్రంలో మోహ‌న్‌బాబు ప్రావీణ్య‌త‌

కరోనా ఎఫెక్ట్ వ‌ల్ల లాక్‌డౌన్‌ను విధించాయి ప్ర‌భుత్వాలు. దీంతో సినీ సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. షూటింగ్స్ అన్నీ ర‌ద్ద‌యిపోవ‌డంతో ఎప్పుడూ షూటింగ్స్,

నిన్న కేసీఆర్.. ఇవాళ హరీష్.. కేంద్రంపై యుద్ధం!?

కేంద్ర ప్రభుత్వంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నాయి. ఇప్పటికే మానిటోరియం, కేంద్రం చేతుల్లోకి కరెంట్, ఎఫ్ఆర్‌బీఎమ్‌, వలస కార్మికుల తరలింపుతో పాటు పలు విషయాల్లో కేంద్రం