రాజ‌మౌళి ఏంటి ఇలా చేశాడు.. టెన్ష‌న్‌లో మెగా ఫ్యాన్స్‌?

మెగాఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారా! అంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తుంది. ఇంత‌కీ మెగా ఫ్యాన్స్ టెన్ష‌న్‌కు కార‌ణం ఎవ‌రు? ఆర్ఆర్ఆర్ సినిమాను తెర‌కెక్కిస్తున్న జ‌క్క‌న్నా. లేక మ‌రేవ‌రో ఉన్నారా? అనే వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుతం జ‌క్క‌న్న రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో తెర‌కెక్కుతోన్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా హాలీవుడ్ తార ఒలివియా మోరిస్ న‌టిస్తుంటే.. చ‌ర‌ణ్ జోడీగా బాలీవుడ్ తార ఆలియా భ‌ట్ న‌టిస్తోంది. రీసెంట్‌గా స్టార్ట్ అయిన షెడ్యూల్‌లో ఆలియా భ‌ట్ జాయిన్ అయ్యింది. మ‌హారాష్ట్ర‌లోని మ‌హాబ‌లేశ్వ‌ర్‌లో వారం రోజుల పాటు జ‌రిగిన షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో ఆలియా భ‌ట్‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. కానీ ఈ షెడ్యూల్‌లో చ‌ర‌ణ్‌, ఆలియాల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించలేదట‌. అస‌లు జ‌క్క‌న్న వీళ్లిద్ద‌రిపై ఎలాంటి స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తాడోన‌ని మెగాభిమానులు టెన్ష‌న్‌లో ఉన్నార‌ట‌.

అయితే త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే మ‌రో షెడ్యూల్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్‌ల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి అప్పుడైనా మెగాఫ్యాన్స టెన్ష‌న్‌ను జ‌క్క‌న్న తీరుస్తాడేమో చూడాలి మ‌రి. లాక్‌డౌన్ త‌ర్వాత ప్రారంభ‌మైన‌ ట్రిపులార్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇంకా ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని, రే స్టీవెన్ స‌న్‌, అలిసన్ డూడి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

More News

బీజేపీలోకి తెలంగాణ మంత్రి తమ్ముడు..!?

తెలంగాణలో టీఆర్ఎస్‌కు పెద్ద షాకులే తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హారిక విజేత కావడానికి అనర్హురాలని చెప్పిన అభి..

గుడ్ మార్నింగ్.. హైదరాబాద్’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఈ పాట హౌస్‌మేట్స్‌లో ఫుల్ జోష్ నింపింది.

రాజ‌కీయాల్లోకి విశాల్‌..!

తెలుగు ప్రేక్ష‌కులకు సుప‌రిచితుడైన తమిళ హీరో విశాల్ రాజ‌కీయ రంగ ప్రవేశం చేయ‌బోతున్న‌ట్లు కోలీవుడ్ మీడియాకు తెలియ‌జేశాడు.

2020 రికార్డ్ ‘వకీల్‌సాబ్’దే

2020.. చాలా కాలం తర్వాత ప్రపంచాన్ని వణికించింది. ఎక్కడికక్కడ స్తంభింపజేసింది. ఈ ఏడాది ఒక్కొక్కరికీ ఒక్కో ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ఇక సినీ ప్రపంచం అయితే ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికీ కోలుకోలేదు.

గూగుల్ సర్వర్లు గంటపాటు డౌన్

గూగుల్ సర్వర్లు ఇవాళ షాకింగ్‌గా గంట పాటు పని చేయకుండా పోయాయి. సాయంత్రం ఐదు గంటలకు ఒక్కసారిగా గూగుల్‌కు చెందిన ప్రధాన సర్వీసుులు జీమెయిల్, యూట్యూబ్, ఫోటోస్,