మెగాఫ్యాన్స్ కంగారు

ఇప్పుడు మెగాఫ్యాన్స్ కంగారు ప‌డుతున్నార‌ట‌. అందుకు కార‌ణంగా మెగాస్టార్ చిరంజీవి ఓ డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నాన‌ని రీసెంట్‌గా ప్ర‌క‌టించ‌డ‌మే. వివరాల్లోకెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి క‌రోనా వేళ సినీ కార్మికుల‌కు సీసీసీ మ‌న‌కోసం సంస్థ ఎలా పాటుప‌డుతుంద‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అందులో తదుపరి సినిమాలు, దర్శకులు గురించి మాట్లాడుతూ మెహర్ రమేష్‌తో కూడా సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఇది విన్న ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు.

అందుకు కారణం ఇదివరకు మెహర్ రమేష్‌కు ఒక హిట్ కూడా లేకపోవడమే. గతంలో మెహర్ రమేష్ ఎన్టీఆర్‌తో కంత్రి, శక్తి సినిమాలను తెరకెక్కించారు. అలాగే ప్రభాస్‌తో బిల్లా, వెంకటేష్‌తో షాడో సినిమాలను డైరెక్ట్ చేశారు మెహర్. అయితే అన్నీ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో హీరోలందరూ మెహర్ ర‌మేష్‌ను దూరం పెట్టారు. ఏదైతేనేం ఎట్టకేలకు మెహర్ రమేష్ చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు . ఇటీవల చిరుని కలిసి కథ కూడా చెప్పాడట. మరి అన్నీ చ‌క్క‌గా కుదిరితే చిరంజీవితో మెహర్ రమేష్ సినిమా పక్క అయినట్లే. ఈ సినిమాపై మ‌రింత క్లారిటీ రావాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

తార‌క్‌, చెర్రీల‌కు రాజ‌మౌళి స‌వాల్‌

లాక్‌డౌన్ వేళ సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇళ్ల‌ల్లోకి ప‌ని మ‌నుషుల‌ను కూడా సెల‌బ్రిటీలు రానీయ‌డం లేదు స‌రిక‌దా! ఎవ‌రింటి ప‌నిని వారే చేసుకుంటున్నారు.

3 నెలలు ఇంటి అద్దె వసూలు చేయొద్దు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల పాటు ఇంటి అద్దె వసూలు చేయొద్దని ఓనర్స్‌కు సీఎం కేసీఆర్ ఒకింత వార్నింగ్.. విజ్ఞప్తి చేశారు.

బ్రేకింగ్: మే-07 వరకు లాక్‌డౌన్ పొడిగింపు : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం నాడు కేబినెట్ భేటీలో సుధీర్ఘంగా చర్చించిన అనంతరం తెలంగాణలో మే-07 వరకు

లాక్‌డౌన్ సడలింపుల్లేవ్.. మే-01 తర్వాత ఊరట : కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్-20 నుంచి లాక్ డౌన్‌ సడలింపులు ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం అలాంటి సడలింపులు ఏమీ ఉండవని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పేశారు.

ఓటీటీలోకి గోవా బ్యూటీ..?

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న స‌మ‌యంలోనే టాలీవుడ్‌ను వీడి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.