జైలుకెళ్లిన మెగా హీరో

  • IndiaGlitz, [Monday,July 10 2017]

మెగా హీరో శ‌నివారం జైలు కెళ్లారు.. అదేదో నేరం చేసి వెళ్లార‌ని అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఆయ‌న వెళ్లింది షూటింగ్ కోసం. ఇంత‌కీ ఆ మెగా హీరో ఎవ‌ర‌ని ఆలోచిస్తున్నారా.. అల్లువారి బుల్లోడు అల్లు శిరీష్‌. ఆయ‌న ప్ర‌స్తుతం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసింది. 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'తో మంచి హిట్‌ను చ‌విచూసిన వి.ఐ. ఆనంద్ తాజాగా సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌ను తెర‌కెక్కిస్తున్నారు. అల్లు శిరీష్ కి ఇందులో టైల‌ర్ మేడ్ పాత్ర కుదిరింద‌ట‌.
సుర‌భి, సీర‌త్ క‌పూర్ ఇద్ద‌రూ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలోకి కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను శ‌నివారం నుంచి చంచ‌ల్‌గూడ్ జైలులో తీస్తున్నారు. అందులో భాగంగా జైల‌ర్ల ప‌ర్మిష‌న్ తీసుకుని షూటింగ్ ఏర్పాటు చేశారు. షూటింగ్ అనంత‌రం అల్లు శిరీష్ కాసేపు అక్క‌డి అధికారుల‌తో ముచ్చ‌టించారు. జైలులోని ఖైదీల‌తో కూడా కాసేపు మాట్లాడారు. అవ‌స‌రాల శ్రీనివాస్‌, ప్ర‌వీణ్ కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.