పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో మెగా హీరో

  • IndiaGlitz, [Wednesday,September 23 2020]

కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన షూటింగ్‌లన్నీ క్రమక్రమంగా తిరిగి ప్రారంభమవుతున్నాయి. దీంతో హీరోలంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కాగా ఒక్కొక్కరూ రకరకాల గెటప్స్‌తో కనిపిస్తున్నారు. ఇప్పటికే యంగ్ హీరో నితిన్ ‘రంగ్‌దే’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయగా.. మెగా హీరో సాయి తేజ్ కూడా కొత్త సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన సాయితేజ్ వచ్చే నెల నుంచి కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు.

సాయితేజ్‌కి సంబంధించిన కొత్త సినిమా విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యంగ్ హీరో.. ప్రస్థానం డైరెక్టర్ దేవకట్టా దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతోంది. ఇప్పటి వరకూ లవర్ బాయ్‌గానే కనిపించిన సాయితేజ్ తొలిసారి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల రెండో వారం నుంచి పట్టాలెక్కనుంది. ఇప్పటికే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో నటించి మహేష్, రానా సక్సెస్ మంచి హిట్ కొట్టారు. సాయి తేజ్ కూడా ఈ సినిమా కలిసొస్తుందని ఆశిద్దాం.

More News

నానితో త్రివిక్ర‌మ్ అదే కార‌ణ‌మా..?

మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌డానికి హీరోలంద‌రూ ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠ‌పురుమ‌లో చిత్రంతో భారీ హిట్‌ను

‘ఆర్ఆర్ఆర్‌’కు జ‌క్క‌న్న రెడీ.. వ‌ర్క‌వుట్లు చేస్తున్న హీరోలు

మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ ముందు వ‌రుస‌లో ఉంది. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న

స్టార్ హీరోయిన్స్‌కు స‌మ‌న్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌తో పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌కు స‌మ‌న్లు అందించిన‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ నుండి టాలీవుడ్‌, శాండిల్ వుడ్ సినీ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్ మాఫియాతో సంబంధాలున్న‌ట్లు

అనురాగ్‌పై కేసు ఫైల్ చేసిన పాయ‌ల్‌

డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్‌పై రీసెంట్‌గా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన న‌టి పాయ‌ల్ ఘోష్ ఇప్పుడు ఆయ‌న‌పై పోలీస్ స్టేష‌న్‌లోకేసు న‌మోదు చేశారు. ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో పాయ‌ల్ ఫిర్యాదును

ఒక్క ట్వీట్ చాలు.. పోకిరీల పని ఫసక్..

ఇవాళా.. రేపు ట్విట్టర్ ఖాతాలు అందరికీ ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్విట్టరే బాధితులకు వరంగా మారనుంది. మనల్ని ఎవరో వేధిస్తున్నారంటూ మన బంధువులకో..