బాలయ్యపై మెగా హీరోస్ ఎటాక్..!?

  • IndiaGlitz, [Friday,May 29 2020]

నందమూరి బాలయ్యపై మెగా హీరోల ఎటాక్ స్టార్ట్ అయ్యిందా..? బాలయ్యపై పంచ్‌లు.. వార్నింగ్‌ల వర్షం కురిపిస్తున్నారా.. ? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, మాటల యుద్ధం, ట్వీట్ల వ్యవహారాన్ని చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఇప్పటికే అటు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అంతేకాకుండా ఓ టీవీ డిబెట్‌లో బాలయ్యను మెగాబ్రదర్ నాగబాబు కడిగేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన కుమారుడు వరుణ్ తేజ్ రంగంలోకి దిగడానికి తెలుస్తోంది. మున్ముంథు మెగా హీరోస్ అందరూ ఎటాక్ చేసే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.

ట్వీట్ వెనుక ఉద్దేశమేంటో..!?

తాజాగా.. ‘చేతిలో తుపాకీ ఉన్న మనిషితో ఎవరూ మాట్లాడలేరు’ అని ట్వీట్ చేస్తూ ‘వాల్మీకి’ సినిమాలోని తాను గన్ పట్టుకుని ఉన్న పోస్టర్‌ను యాడ్ చేశాడు వరుణ్ తేజ్. ఈ ట్వీట్ ఇప్పుడు నానా అర్థాలిస్తోంది. అంటే.. ఇండస్ట్రీ మీ చేతిలో ఉందని మీతో మాట్లాడకూడదా..? అని నెటిజన్లు, నందమూరి అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మీ నాన్న మీరూ.. రేపు ఫ్యామిలీ ఫ్యామిలీ బాలయ్యనే టార్గెట్ చేస్తారా..? అని కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. మొత్తానికి చూస్తే వరుణ్ చేసిన ఇండైరెక్ట్ ట్వీట్ ఎవర్ని ఉద్దేశించినది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ ట్వీట్ వెనుక ఉద్దేశమేంటో వరుణ్‌కే తెలియాలి మరి. మొత్తానికి చూస్తే నిన్న నాగబాబు.. ఇవాళ వరుణ్ ఇంకాస్త అగ్గి రాజేశారన్నది కొందరు విమర్శకుల మాట.

More News

ఇదేం పెళ్లా.. బొట్టి పెట్టి పిలవడానికి..: తమ్మారెడ్డి

ఇండస్ట్రీలో ఎవరూ ఎవర్నీ బొట్టు పెట్టి మరీ పిలవరని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. ఇవాళ మెగాస్టార్ చిరు ఇంట్లో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..

చిరు ఇంట్లో ముగిసిన సీసీసీ స‌మావేశం.. ఎవ‌రేమ‌న్నారంటే?

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సినిమా ప‌రిశ్ర‌మ చాలా ఇబ్బందుల‌ను ఫేస్ చేసింది. ముఖ్యంగా సినీ కార్మికుల‌కు ప‌ని లేకుండా పోయింది.

‘నిమ్మగడ్డ’దే న్యాయం.. జగన్ సర్కార్‌కు హైకోర్ట్ షాక్

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్‌కు హైకోర్టు మరో షాకిచ్చింది. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకూ హైకోర్టులో చాలా ఎదురుదెబ్బలే తగిలాయి.

‘ఆర్ఆర్ఆర్‌’లో ర‌కుల్ స్పెష‌ల్‌

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).

డోంట్ వర్రీ.. ‘మిడత’ను ఇలా తరిమేయండి..!!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ముప్పుతో యావత్ ప్రపంచం కకావికలం అవుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం..