చిత్ర ప‌రిశ్ర‌మ కోసం మెగా మీటింగ్‌

  • IndiaGlitz, [Wednesday,May 20 2020]

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప‌లు రంగాల్లో సినీ పరిశ్ర‌మ ముందు వ‌రుస‌లో ఉంది. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం, షూటింగ్స్ లేక‌పోవ‌డం వంటి కార‌ణాలతో సినీ ప‌రిశ్ర‌మ స్తంభించింది. దీంతో విడుద‌ల‌కు సిద్ధ‌మైన ప‌లు సినిమాల విడుద‌ల‌లు ఆగిపోయాయి. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వాలు ప‌లు రంగాల‌కు స‌డ‌లింపులు ఇస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చిత్ర ప్ర‌ముఖులు సినిమా రంగానికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. అందులో భాగంగా ఇప్ప‌టికే కొన్ని విష‌యాల్లో సినీ పెద్ద‌లు కొంత మేర‌కు చ‌ర్చ‌లు జ‌రిపారు.

సినిమా థియేట‌ర్స్‌ను ఓపెన్ చేయ‌డం, సినిమా షూటింగ్‌ల‌ను ప్ర‌భుత్వం విధించిన నిబంధ‌న‌ల మేర‌కు కొన‌సాగించ‌డం అనే విష‌యాల‌పై మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్ర‌మలోని ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రప‌డానికి రెడీ అయిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చ‌ర్చ‌ల అనంతరం సీఎం కేసీఆర్ర‌, ఇత‌ర ప్ర‌భుత్వం పెద్ద‌ల‌ను క‌లుసుకోవాల‌ని చిరంజీవి స‌హా ఇత‌ర సినిమా పెద్ద‌లు ఆలోచిస్తున్నారు. చిత్ర సీమ‌లో ఏర్ప‌డ్డ న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసేలా ప్రేక్ష‌కుడిని తిరిగి థియేట‌ర్‌కు ర‌ప్పించేలా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.

More News

తెలంగాణలో ఇవాళ్టికి సేఫ్.. కొత్తగా 27 కేసులు!

తెలంగాణలో గత కొన్నిరోజులుగా చూస్తే కాస్త తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ్టికి సేఫ్‌ జోన్‌లోనే ఉన్నట్లే.

డిజిట‌ల్‌కు రానా త్రిభాషా చిత్రం

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో సినీ రంగం కుదేలైంది.ముఖ్యంగా చిన్న సినిమాల ప‌రిస్థితి ఘోరంగా తయారైంది.

మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్

కరోనా లాక్ డౌన్‌తో దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిరు పరవు తీయకు.. నాగబాబుపై కేసు నమోదు

జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పేర్కొంటూ జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు ట్వీట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు.