మెగా బ్లడ్‌ బ్రదర్ నూర్‌కు చెర్రీ  10 లక్షల సాయం

  • IndiaGlitz, [Monday,December 09 2019]

మెగాహీరోలను.. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణంగా అభిమానించే హైదరాబాద్‌కు చెందిన వీరాభిమాని నూర్ మహ్మద్ ఆదివారం నాడు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరాభిమాని చనిపోయాడని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు మెగా హీరోలు చలించిపోయారు. వెంటనే నూర్ నివాసానికి వెళ్లిన మెగా హీరోలు... ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. నూర్ కుటుంబ సభ్యులను ఓదార్చి మీకు అన్ని విధాలా అండగా ఉంటామని అభయమిచ్చారు. ఈ సందర్భంగా మాటచెప్పిన విధంగానే నూర్ కుటుంబానికి రామ్ చరణ్ భారీగా ఆర్థిక సహాయం ప్రకటించాడు.

పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి..

షూటింగ్‌లో బిజీబిజీగా ఉండటంతో వీరాభిమానిని రామ్‌ చరణ్ కడసారి చూడలేకపోయాడు. అయితే షూటింగ్ ముగించుకుని రాగానే నూర్ కుటుంబీకులను కలుస్తానని చెర్రీ చెప్పాడు. ఈ క్రమంలో నూర్ కుటుంబానికి రూ. 10 లక్షల సాయం ప్రకటించాడు. ఈ సందర్భంగా నూర్ అహ్మద్‌తో తమ మెగా ఫ్యామిలీకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు. ‘మా కుటుంబంలో ఎవరి పుట్టినరోజైన రక్తదాన శిబిరాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన నూర్ అహ్మద్ సేవలు వెలకట్టలేం. ఆయనలేని లోటు తీరనిది. గతంలో ఒకసారి ఆయన హాస్పిటల్‌లో ఉన్నపుడు నేను స్వయంగా వెళ్లి పరామర్శించాను. నూర్ మరణ వార్త మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. మెగా బ్లడ్ బ్రదర్ నూర్ అహ్మద్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరకుంటున్నాను’ అని ప్రకటనలో రామ్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు.

More News

హీరో సిద్ధార్థ్ టక్కర్ ఫస్ట్ లుక్ విడుదల

మెగా హీరో వరుణ్ తేజ్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం టక్కర్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. సిద్ధార్థ్,

వరుస చిత్రాలతో నందిని రాయి ఫుల్ బిజీ

నందిని రాయ్ ఈ పేరు వినగానే మనకి గుర్తుచ్చే సినిమాలు ఖుషి ఖుషీగా , మోసగాళ్లకు మోసగాడు మరియు సిల్లీ ఫెలోస్.

‘సూర్యుడివో చంద్రుడివో..’ సాంగ్: రాక్‌స్టార్ రాక్స్.. ప్రాక్ ఫసక్!

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

రజినీకాంత్‌ తో మహానటి

తలైవా, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 168వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

రోజా వ్యాఖ్యలపై పవన్ రియాక్ట్ అవుతాడా!?

ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి చెమ్డాలు ఊడేలా రెండు బెత్తం దెబ్బలు కొట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.