close
Choose your channels

Ram Charan : మరోసారి హిందీలో చరణ్ చిత్రం.. ఏకంగా సల్మాన్‌ఖాన్‌తో కలిసి, మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే

Tuesday, March 7, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో గతేడాది ప్రేక్షకులను పలకరించారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఎన్టీఆర్‌తో పోటాపోటీగా నటించారు చరణ్. ఈ చిత్ర ఘన విజయంతో చెర్రీ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో వుండటంతో ఆయనకు హాలీవుడ్ రేంజ్ పాపులారిటీ వచ్చేసింది. మొత్తం చిత్ర యూనిట్ అంతా అమెరికాలో మకాం వేసి ఆస్కార్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

సల్మాన్, పూజాలతో కలిసి స్టెప్పులు వేయనున్న చరణ్:

ఇదిలావుండగా.. రామ్‌చరణ్ హిందీలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది కూడా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి. వివరాల్లోకి వెళితే.. సల్లూబాయ్ హీరోగా నటించిన తాజా సినిమా ‘‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’’. ఇందులో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో నటించారు. ఇటీవల సల్మాన్, హీరోయిన్ పూజా హెగ్డేలతో కలిసి వెంకటేశ్ డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాలో చరణ్ కూడా నటిస్తున్నారు. ‘‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’’లోని ఓ పాట కోసం సల్మాన్, వెంకటేశ్, పూజాలతో పాటు మెగా పవర్ స్టార్ కూడా స్టెప్పులు వేశారు. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రాఫి అందించారు. భారీ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ఈ సినిమా కోసం మెగాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

సల్మాన్, మెగా ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం:

కాగా.. తొలి నుంచి సల్మాన్ ఖాన్, మెగా ఫ్యామిలీ మధ్య తొలి నుంచి మంచి అనుబంధం వుంది. సల్లూభాయ్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చిరు ఇంటిలో ఆథిత్యం స్వీకరించేవారు. ఆ అభిమానంతోనే చిరంజీవి కోసం గాడ్ ఫాదర్‌లో స్పెషల్ రోల్ చేశారు. వెండితెరపై సల్మాన్, చిరు కలిసి నటించిన సీట్లు హైలైట్‌గా నిలిచాయి. అటు హిందీలో రామ్ చరణ్ నటించిన జంజీర్ సినిమా సమయంలో చెర్రీకి సల్మాన్ ఖాన్ మద్ధతుగా నిలిచారు. మరోవైపు.. ప్రస్తుం రామ్ చరణ్ తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.