Ram Charan:నాన్నగారు సైలెంట్‌గా వుంటారేమో.. మేం ఉండం, ఆయన మౌనం వీడితే : రామ్‌చరణ్ సంచలన వ్యాఖ్యలు


Send us your feedback to audioarticles@vaarta.com


స్టేజ్‌పై ఎప్పుడు మైక్ అందుకున్నా సౌమ్యంగా మాట్లాడే యువ కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని ఎవరైనా పల్లెత్తు మాట అంటే తాము ఊరుకోమని ఆయన హెచ్చరించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య విజయోత్స సంబరాలు శనివారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి మౌనం వీడితే ఏమవుతుందో ఎవరికీ తెలియదన్నారు. చిరంజీవి సైలెంట్‌గా వుంటారేమో తాము వుండబోమని చెర్రీ హెచ్చరించారు. చిరంజీవిని ఏమైనా అనాలంటే అది కుటుంబ సభ్యులు, అభిమానులకు మాత్రమే హక్కు వుందన్నారు.
నిర్మాతలకు చురకలంటించిన చెర్రీ :
ఇదే సమయంలో పలువురు నిర్మాతలకు ఆయన వేదికపైనే చురకలంటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్ని నుంచి ఎంతో నేర్చుకోవాలని అన్నారు. సినిమాను ఎంతో డెడికేషన్‌తో తీస్తారని.. ఏ హీరోతో సినిమా చేసినా వారికి గుర్తుండిపోయే హిట్ ఇస్తారని రామ్‌చరణ్ చెప్పారు. తనకు రంగస్థలం లాంటి విజయాన్ని ఇచ్చారు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక దర్శకుడు బాబీని చెర్రీ ఆకాశానికెత్తేశారు. పూనకాలు లోడింగ్లాగే సినిమా వుందని.. నాన్నగారు తనకు బ్రదర్‌లా వున్నారని, అంత యంగ్‌గా చూపించారని థ్యాంక్స్ చెప్పారు. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మూడు పాటలు అందించి మ్యాజిక్ చేశారని చెర్రీ ప్రశంసించారు.
రవితేజ పాత్ర అప్పుడే అయిపోయిందా అనిపించింది:
ఇక రవితేజ పాత్ర, దాని తీరు తెన్నులను కూడా చరణ్ మెచ్చుకున్నారు. రవి పాత్ర చాలా సీరియస్‌గా వుందని.. ఆయన క్యారెక్టర్ అప్పుడే అయిపోయిందా అనే అసంతృప్తి వుందన్నారు. దీంతో తాను రవితేజ నటించిన ధమాకాను ఓటీటీలో చూశానని రామ్‌చరణ్ తెలిపారు. నాన్నగారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి డైలాగ్‌ను ఆయన తమ్ముడులాంటి రవితేజ మాత్రమే అనగలిగారని, దాన్ని తీసుకోగలిగామని.. అదే మరొకరు అని వుంటే తీసుకునేవాళ్లం కాదని రామ్‌చరణ్ అన్నారు. అంతా బాగానే వుంది కానీ.. రామ్‌చరణ్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడనే దానిపై టాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆ మధ్య మెగా బ్రదర్స్‌పై రోజా కామెంట్స్ :
అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలినీ టార్గెట్ చేయడం కలకలం రేపింది. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌పై మాత్రమే విరుచుకుపడే రోజా నేరుగా మెగా బ్రదర్స్‌పై విమర్శలు గుప్పించడం వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లను ముగ్గురిని సొంత జిల్లా ప్రజలే ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్ధమవుతోందన్నారు. సినీనటులు అందరికీ సాయం చేస్తారని.. కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నంగా వున్నారంటూ రోజా విమర్శించారు. చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్ కల్యాణ్ మూతికి ప్లాస్టర్ వేసుకుంటాడంటూ ఆమె తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇప్పటంలో గోడలకు ఇచ్చిన విలువ... తొక్కిసలాటలో చనిపోయిన వారికి పవన్ ఇవ్వడం లేదని రోజా ఎద్దేవా చేశారు. దీనికి చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లు విడివిడిగా గట్టి కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.