కొత్త రంగంలోకి మెగా ప్రొడ్యూస‌ర్‌

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌లో ఉన్న అగ్ర నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ ఒక‌రు. సీనియ‌ర్ నిర్మాత‌లు చాలా మంది వారి పంథాలో ముందుకెళ్ల‌డానికే ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ అంద‌రికీ భిన్నం అల్లు అర‌వింద్‌. ఎందుకంటే ఆయ‌న ట్రెండ్‌కు త‌గిన‌ట్టు ముందుకెళుతుంటారు. అందుక‌నే స‌క్సెస్‌ల మీద స‌క్సెస్‌లు అందుకుంటున్నాడు. చిన్నసినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు, మీడియం బ‌డ్జెట్ సినిమాల కోసం జీఏ 2 పిక్చ‌ర్స్ అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి యంగ్ డైరెక్ట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్‌తో సినిమాలు చేసి అక్క‌డా విజ‌యాల‌ను ద‌క్కించుకుంటున్నారు.

తాజాగా సినిమాల‌కు ధీటుగా డిజిట‌ల్ రంగం డెవ‌ల‌ప్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ట్రెండ్‌కు త‌గిన‌ట్టు అల్లు అర‌వింద్ త‌నకున్న సినిమా సోర్స్‌ల‌ను ఉప‌యోగించుకుని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతున్నాడ‌ట‌.

అల్లు అర‌వింద్ బిజినెస్ మైండ్ తెలిసిన మై హోమ్స్ రామేశ్వ‌రరావు, మ్యాట్రిక్స్ ప్ర‌సాద్ ఆయ‌న‌తో చేతులు క‌లిపారు. ఈ రంగంలో కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి అల్లు అర‌వింద్ సిద్ధ‌మ‌య్యారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ...అల్లు అరవింద్ త‌న‌కు అచ్చొచ్చిన అ అక్ష‌రంతోనే త‌న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కు పేరు పెట్టాడ‌ట‌. అహా అనేది అర‌వింద్ స్టార్ట్ చేయ‌బోయే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ పేరు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారాన్ని అనౌన్స్ చేయ‌బోతున్నార‌ట‌.

More News

బ‌న్నీ పాఠాలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే అంద‌రిలో ఓ ఆస‌క్తి నెల‌కొంది.

హైదరాబాద్, బెంగళూరుకు పాకిన కరోనా వైరస్!!

కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ బారీన పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

పాక్, కేంద్రంకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్‌ వార్నింగ్!

హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే.

ఏఎంబీకి మించిన మల్టీఫ్లెక్స్‌ నిర్మించబోతున్న మహేశ్!

హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అమరావతిలో పవన్‌కు 62 ఎకరాలపై జనసేన క్లారిటీ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అమరావతిలో 62 ఎకరాలు భూములు ఉన్నాయని..