త్వరలో సినీ పరిశ్రమకు అనుకూలంగా జీవో : జగన్‌తో భేటీ అనంతరం చిరు వ్యాఖ్యలు

సినిమా టికెట్ ధరలు, ఇతర టాలీవుడ్‌కు సంబంధించిన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీనటుడు చిరంజీవి భేటీ ముగిసింది. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో చిరు మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్‌ ధరల విషయంపై జగన్‌తో జరిగిన చర్చ సంతృప్తినిచ్చిందన్నారు. తనకెంతో ఆనందంగా ఉందని.. సీఎం తనను ఓ సోదరుడిగా పండగ వేళ భోజనానికి ఆహ్వానించారని చిరు పేర్కొన్నారు.

తనను ఎంతగానో ఆదరించిన వైఎస్ జగన్ ఆయన సతీమణి భారతీకి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినిమా టికెట్‌ ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంస ఉందని.. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటంకాదు రెండో కోణంలోనూ వినాలని మెగాస్టార్ సూచించారు. ఆయన తన పెట్టిన నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించిందని.. సినీ పరిశ్రమలో ఎవరూ మాట జారొద్దని చిరంజీవి కోరారు.

సామాన్యుడికీ వినోదం అందుబాటులో ఉండాలన్న జగన్ ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. చిత్ర పరిశ్రమ, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమానుల సమస్యల గురించి ఆయనకు వివరించానన్నారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించారని... ఆమోదమైన నిర్ణయం తీసుకుంటానని, కమిటీ తుది నిర్ణయానికొస్తుందని చిరంజీవి వ్యాఖ్యానించారు. త్వరలో సినీ పరిశ్రమకు అనుకూలంగా జీవో వస్తుందని చిరు పేర్కొన్నారు.

More News

త్వరలో "దొరకునా ఇటువంటి సేవ" మూవీ

సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం.. ప్రస్తుతం అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది..

శ్రీవిద్యానికేతన్‌కు యూనివర్సిటీ హోదా: ‘‘ చిన్న మొలకలు... కల్ప వృక్షంగా’’ మారాయంటూ మోహన్ బాబు ట్వీట్

హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు

బ్యాడ్మింటన్ లీగ్‌లో కోవిడ్ కలకలం.. కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్

భారత్‌లో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిపుణులు చెప్పినదాని కంటే వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకపోయినా మాకేం బాధలేదు.. కానీ : రామ్‌చరణ్ హాట్ కామెంట్స్

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’.

అల వైకుంఠపురానికి రెండేళ్లు : ఒక్క హిట్టు.. ‘‘పూజా’’ని స్టార్ హీరోయిన్‌ని చేసింది

కొన్ని సినిమాలు కొందరి కోసమే పుడతాయి. అవి కూడా చరిత్రను తిరగరాసేవిగానో, ఎదుగుబొదుగు లేని జీవితానికి మంచి బూస్ట్ ఇచ్చేలాంటివో అవుతాయి.