మెగా స‌ర్‌ప్రైజ్ అప్పుడేనా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో పాటు మెసేజ్‌ను మిక్స్ చేసి మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను వంటి సినిమాలు చేసిన కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌టం విశేషం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ న‌టించున్నాడ‌నేది దాదాపు ఖాయ‌మైంది. చిత్ర యూనిట్ నుండి క‌న్‌ఫ‌ర్మేష‌న్ మెసేజ్ రావాల్సి ఉంది. ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. అన్నీ కార్యక్ర‌మాలు పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

దేవ‌దాయ భూముల‌ను కాపాడే నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాలో చిరంజీవి న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాలో చిరంజీవి లుక్ కూడా లీకై సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా లేటెస్ట్ స‌మాచారం మేర‌కు చిత్ర యూనిట్ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది.

More News

మారుతీరావు ఆత్మహత్య.. ఆయనపైనే అమృతకు డౌట్!

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

కొత్త వ్యాపారంలోకి మ‌హేశ్‌

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన సూప‌ర్‌స్టార్‌ మ‌హేశ్ కాల్షీట్స్ చాలా క్లాస్టీ. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోల్లో ముందు వ‌రుస‌లో

ఇదే తొలిసారి ..చివ‌రిసారి: రెజీనా

ఎస్‌.ఎం.ఎస్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన చెన్నై సొగ‌స‌రి రెజీనా క‌సండ్ర కొత్త ట‌ర్న్ తీసుకున్నారు.

చిరంజీవిగారు లేక‌పోతే ఆత్య‌హత్య చేసుకునేవాడిని:  పృథ్వీ

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున ప్ర‌చారం చేసిన క‌మెడియ‌న్ పృథ్వీ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్‌వీబీసీ చైర్మ‌న్ అయ్యారు.

అభినయానికి ఆస్కారమున్న పాత్రలను కోరుతున్న లావణ్యా త్రిపాఠి

ఆకర్షణీయమైన, మనోహరమైన రూపానికి అద్భుతమైన అభినయం తోడైతే లావణ్యా త్రిపాఠి. తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అందాల రాక్షసి ఆమె.