మ‌రోసారి మెగా సంద‌డి.. ‘ఆచార్య’ ఫ‌స్ట్ లుక్ డేట్‌

ఉగాదికి మెగా సంద‌డి నెల‌కొంది. ఒక ప‌క్క జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’ మోషన్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. ఆ ఊపు స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే మ‌న్నెందొర అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. దీనికి వ‌స్తోన్న రెస్పాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సంద‌డి సద్దుమణ‌గ‌క ముందే మెగాస్టార్ చిరంజీవి సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతున్న వార్త‌ల మేర‌కు శ్రీరామన‌వ‌మికి చిరంజీవి, కొర‌టాల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్‌పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్నార‌ట‌. అదే క‌నుక నిజ‌మైతే మెగాభిమానుల‌కు పండ‌గే.

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య‌’ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అయితే ఈ సినిమా అనుకున్న‌ప్ప‌టి నుండి మేకింగ్‌లో ఏదో ఒక అవాంత‌రం ఏర్ప‌డుతూనే ఉంది. తాజాగా కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ ఆగి ఉంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

More News

మ‌రో క్రేజీ సినిమాలో పూజా హెగ్డే!

పొడుగు కాళ్ల సొగ‌స‌రి పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్ క్రేజీ సినిమాల్లో న‌టిస్తుంది. ఈ ఏడాది ఈ అమ్ముడు బ‌న్నీతో క‌లిసి న‌టించిన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ భారీ విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే.

త‌నదైన మార్కుతో మారుతి

మారుతి.. ఆయ‌న కెరీర్ స్టార్ట్ అయిన ప్రారంభంలో ఉన్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టికీ చాలా మార్పు క‌న‌ప‌డుతుంది. మినిమ‌మ్ బ‌డ్జెట్‌తో, మినిమం హిట్ సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్నాడు మారుతి.

రకుల్ ప్రీత్ కు బాలీవుడ్ ఆఫర్

పంజాబీ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. అయితే ఒక‌ప్పుడు ఉన్నంత స్పీడుగా ర‌కుల్ కెరీర్ లేద‌నేది వాస్త‌వం.

బ‌న్నీ సీక్రెట్‌ను బ‌య‌ట పెట్టిన త్రిష‌

క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌తో ఇండియా మొత్తం లాక్ డౌన్ అయ్యింది. సినిమా షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. స్టార్స్ అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైయారు. వేరే ప‌నులేవీ లేక‌పోవ‌డంతో అంద‌రూ

కరోనాపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితితో ఇరు రాష్ట్రాల ప్రజల భయపడిపోయారు.