మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ : ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ కన్ఫర్మ్.. ఎప్పుడంటే..?

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా, తదితర కారణాలతో వాయిదాపడింది. ఎట్టకేలకు అన్ని అవాంతరాలను దాటుకుని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా కూడా ప్రారంభించనున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మెలోడీ బ్రహ్మా మణిశర్మ చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ కూడా రెడీ అయింది.

ఏప్రిల్ 24 (ఆదివారం) హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్‌ గ్రౌండ్స్‌లో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ తేజ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ‘‘ఆచార్య’’ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీరామనవమి కానుకగా ట్రైలర్ లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేనిపక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదికపై విడుదల కావొచ్చని ఫిలింనగర్ టాక్.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్ప‌టికే ఆచార్య నుంచి విడుద‌లైన 'లాహె లాహె', 'నీలాంబ‌రీ' ‘శానా కష్టం’ పాటలు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించాయి. ఇక చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మెగాస్టార్.

More News

హరిహర వీరమల్లు అదిరిపోయే సెట్స్..  ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని సత్కరించిన పవన్ కల్యాణ్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

‘పుష్ప.. పుష్పరాజ్‌.. జ‌వాబులు రాసేదే లే’.. టెన్త్ స్టూడెంట్ ఆన్సర్ షీట్‌‌‌ వైరల్, టీచర్‌కు షాక్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు,

రియల్ స్టార్ సోనూసూద్‌కు అరుదైన గౌరవం.. ‘‘గోల్డెన్ వీసా’’ ఇచ్చిన దుబాయ్

కరోనా సమయంలోనూ.. ఆ తర్వాత కూడా తన సామాజిక సేవతో ఎంతోమంది అవసరాలు తీర్చారు సోనూసూద్.

నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లా.. నమ్మలేకపోతున్నా: పూజా హెగ్డే

నెల్సన్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్- పూజా  హెగ్డే నటించిన ‘‘బీస్ట్’’ చిత్రం ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధమైంది.

సోదరిగానైనా గౌరవించాలిగా .. ఎన్నోసార్లు అవమానించారు: కేసీఆర్ సర్కార్‌పై తమిళిసై ఆరోపణలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌ల మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే.