నన్ను రాజకీయాల్లోకి మనస్పూర్తిగా ఆహ్వానించారు... రోశయ్య మరణంపై చిరంజీవి ఎమోషనల్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత అని కొనియాడారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడటంలో ఓ రుషి మాదిరిగా సేవ చేశారని చిరంజీవి ప్రశంసించారు. రోశయ్య కన్నుమూతతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా రోశయ్య ఆహ్వానించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందారని మెగాస్టార్ పేర్కొన్నారు.

ఇక రోశయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించారని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. అటు ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు కూడా రోశయ్య మరణం పట్ల సంతాపం తెలిపారు.

కాగా.. శనివారం ఉదయం లోబీపీ రావడంతో రోశయ్యను కుటుంబసభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్‌ స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వృద్ధాప్యం కారణంగా రోశయ్య చాలా కాలంగా ఇంటికే పరిమితమై, ప‍్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: టికెట్ టూ ఫినాలే‌లో గెలుపు.. ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీరామ్

తుది అంకానికి చేరే కొద్ది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఉత్కంఠ రేపాల్సింది పోయి.. బోర్ కొట్టిస్తోంది.

రాజకీయ కురువృద్ధుడు.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు.

థియేటర్ల మూసివేత వుండదు..  టికెట్ రేట్లపై త్వరలోనే నిర్ణయం: టాలీవుడ్‌కు తలసాని హామీ

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద దుమారం రేపిన  సంగతి తెలిసిందే.

బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకెళ్తోన్న మహేశ్ బాబు.. సూపర్‌స్టార్ ఖాతాలోకి ‘‘మౌంటెన్ డ్యూ’’

సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. గ్రీకు రాకుమారుడిలా కనిపించే ఆయనంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: షన్నూ కొంపముంచిన ‘‘ 2 సెకన్లు ’’.. సన్నీదే పైచేయి, ఉత్కంఠగా ‘‘టికెట్ టూ ఫినాలే’’

బిగ్‌బాస్ 5 తెలుగు ఫైనల్ బెర్త్‌ల కోసం జరుగుతున్న టికెట్ టు ఫినాలే టాస్క్‌ ఈ రోజు కూడా రసవత్తరంగా సాగింది.