Chiranjeevi : ఆ మాట ఎంతో ఊరటనిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్


Send us your feedback to audioarticles@vaarta.com


గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే వున్నట్లు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్లుగా తారకరత్నకు ఎక్మోపై చికిత్స అందించడం లేదని నారాయణ హృదయాలయ తెలిపింది. మరోవైపు ఆయన కోలుకోవాలని నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు కోరుకుంటున్నారు.
ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది :
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ‘‘ సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలి మై డియర్ తారకరత్న’’ అంటూ చిరు ట్వీట్ చేశారు.
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:
కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో నిన్న యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.
సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2023
ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.
May you have a long and healthy life dear Tarakaratna!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.