close
Choose your channels

Chiranjeevi:RRR టీమ్‌ను సత్క‌రించిన మెగాస్టార్ చిరంజీవి

Wednesday, March 29, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. చాలా గ్రాండ్‌గా జ‌రిగిన ఈ పార్టీలో ప్ర‌ముఖ న‌టీన‌టులు, టాలీవుడ్ సెల‌బ్రిటీలు స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.

మెగ‌స్టార్ చిరంజీవి ఇంట్లో రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో చ‌ర‌ణ్‌ను ఎంత‌గానో ఇష్ట‌ప‌డే హీరోలు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విక్ట‌రీ వెంకటేష్ స‌హా రామ్ చ‌ర‌ణ్ చిన్న‌నాటి స్నేహితుడు రానా ద‌గ్గుబాటి త‌న స‌తీమ‌ణి మిహిక‌తో క‌లిసి పాల్గొన్నారు. ఇంకా అక్కినేని నాగార్జున‌, అమ‌ల‌, నాగ చైత‌న్య‌, అఖిల్ ఫంక్ష‌న్‌కి అటెండ్ అయ్యారు.

ఇంకా అడివి శేష్‌, నిఖిల్ సిద్ధార్థ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ, నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, దిల్ రాజు త‌దిత‌రులు కూడా విచ్చేశారు.

రామ్ చ‌ర‌ణ్‌తో మంచి అనుబంధం ఉండే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, కె.జి.య‌ఫ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ వంటి స్టార్ డైరెక్ట‌ర్స్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన్నారు.

రాజ‌మౌళి స‌హా RRR టీమ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ఎం.ఎం.కీర‌వాణి, నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌, సినిమాటోగ్ర‌ఫీర కె.కె.సెంథిల్ కుమార్‌, , ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌వ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. మార్చిలో జ‌రిగినే ఆస్కార్ ఈవెంట్‌ తర్వాత ఈ టీమ్ ఇప్పుడే ఒకేసారి వేదిక‌పై క‌నిపించింది. తొలి ఆస్కార్ అవార్డును గెలిచి మ‌న దేశానికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన RRR టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా స‌త్క‌రించారు.

అతిథుల‌కు ఇండియ‌న్, కాంటినెంట‌ర్ వంట‌కాల‌ను ప్రత్యేకంగా ప్రిపేర్ చేసి స‌ర్వ్ చేశారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.