సంక్రాంతి బరిలో మెగాస్టార్ ఖైదీ నంబర్ 150

  • IndiaGlitz, [Monday,October 03 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150. ఈ భారీ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంది. వి.వి.వినాయక్ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యాన‌ర్ పై మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోష‌న్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చినందుకు చిత్ర‌యూనిట్ ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ...70 శాతం పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నాన్న‌గారు డ‌బ్బింగ్ కూడా ప్రారంభించారు. ఇప్ప‌టివ‌ర‌కూ చ‌క్క‌ని ఔట్‌పుట్ వ‌చ్చింద‌న్న సంతృప్తి ఉంది. అన్ని ప‌నులు పూర్తి చేసి, జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా ఖైదీ నంబ‌ర్ 150 చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
ర‌త్న‌వేలు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

More News

ప్రతి ఉద్యోగి తప్పకుండా చూడవలసిన చిత్రం 'హైపర్' - తెలంగాణ ఎన్జీఓస్ సంఘ గౌరవ అధ్యక్షులు దేవిప్రసాద్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్లో వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై

హాలీవుడ్ నటుడితో...

విశ్వరూపం,ఉత్తమవిలన్ చిత్రాల్లో నటించిన పూజా కుమార్ త్వరలోనే హాలీవుడ్ రంగ ప్రవేశం చేయనుంది.

కొత్త టెక్నాలజీతో కార్తీ 'కాష్మోరా'...

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి.సినిమా,డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి,

రామేశ్వరానికి కాటమరాయుడు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్పై శరత్ మరార్ నిర్మాతగా డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కాటమరాయుడు'.

ఐశ్వర్వ సినిమా 'వీరన్'

రజనీకాంత్ తనయ,హీరో ధనుష్ శ్రీమతి ఐశ్వర్య ధనుష్ దర్శకురాలిగా రాణించాలని తన వంతుగా ప్రయత్నాలు చేస్తుంది.