Chiranjeevi : చిరంజీవి మ‌ళ్లీ లీక్ చేసేశారు .. ఆ స్టెప్పులకు తమన్నా, కీర్తి ఫిదా.. మీరు చూశారా.?

  • IndiaGlitz, [Thursday,June 08 2023]

లేటు వయసులో కుర్రాళ్లకు పోటీనిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వారి కంటే ఎక్కువగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేర్ వీరయ్యగా వచ్చి బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ ప్రస్తుతం భోళా శంకర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం స్విట్జర్లాండ్‌లో ఓ సాంగ్‌ను చిత్రీకరించింది యూనిట్.

ఇకపోతే.. గత కొంతకాలంగా చిరు లీక్స్ పేరుతో తను నటిస్తున్న సినిమాల విషయాలను , అందులోని పాటలను లీక్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు చిరంజీవి. కొద్దిరోజుల క్రితం స్విట్జర్లాండ్‌లో తమన్నా, చిరులపై ఓ సాంగ్‌ని షూట్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన లోకేషన్ ఫోటోలను షేర్ చేశారు. అవి నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈసారి ఏకంగా భోళా శంకర్‌లోని సంగీత్ పార్టీ నేపథ్యంలో చిత్రీకరించిన పాటను చిరంజీవి లీక్ చేసేశారు. ఇందులో ఆయనతో పాటు సుశాంత్, కీర్తి సురేష్, తమన్నాలు ఆడిపాడారు. చిరంజీవికి దర్శకుడు మెహర్ రమేశ్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌లు సూచనలు ఇస్తూ వుండగా.. కీర్తి సురేష్, తమన్నాలను మెగాస్టార్ ఆటపట్టిస్తున్నారు. చివరిలో చిరు వేసిన స్టెప్పులకు అక్కడున్న వారంతా కేకలు వేస్తూ వుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం చిరు లీక్స్‌ను మీరూ చూసేయండి.

కాగా.. సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రఘుబాబు, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిశోర్, సుశాంత్, తులసి, శ్రీముఖి, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 11న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది.

More News

Calling Sahastra:'కాలింగ్ సహస్త్ర' లో డిఫరెంట్ సుధీర్‌ని చూస్తారు: 'కలయా నిజమా..' సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్‌

అటు బుల్లి తెర ఇటు సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ సుడిగాలి సుధీర్‌.

Narendra Modi:మోడీ అమెరికా పర్యటన .. వాషింగ్టన్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని, వివరాలివే

ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.

Adipurush : సెన్సార్ పూర్తి చేసుకున్న ఆదిపురుష్‌ .. ఎలాంటి సర్టిఫికెట్‌ వచ్చింది, రన్ టైమ్ అంత సేపా ..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘‘ఆదిపురుష్’’.

Balaji Temple Chief Priest:శేషవస్త్రం ధరించి పాడు పనులా : కృతి , ఓం రౌత్‌‌ 'ముద్దు' పై చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడి ఆగ్రహం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయం ఆవరణలో ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్‌లు

Bhagavant Kesari : భగవంత్ కేసరిగా నటసింహం..  ఇక మాస్ జాతరే, టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

తిరుగులేని విజయాలతో లేటు వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు నందమూరి బాలకృష్ణ.