ప‌చ్చ‌ద‌నానికి నేను సైతం.. మెగాస్టార్ హ‌రిత‌హారం

  • IndiaGlitz, [Tuesday,July 31 2018]

పచ్చ‌ని మొక్క ప్ర‌ణ‌వాయువుని ఇస్తుంది. కాలుష్యం నుంచి మ‌నిషిని కాపాడుతుంది. నిరంత‌ర కాలుష్యంతో ప్ర‌మాద‌పుటంచును తాకుతున్న మాన‌వాళిని జాగృతం చేయ‌డ‌మే ధ్యేయంగా ప‌లు అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ‌ సంస్థ‌లు ఎంతో కృషి చేస్తున్నాయి. ఆ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్రం చేప‌ట్టిన ఉద్య‌మ‌మే హ‌రిత‌హారం. రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేయ‌డ‌మే ధ్యేయంగా తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంచుకున్న మార్గమిది. మొక్క‌లు నాట‌డ‌మే దీని ఉద్ధేశ్యం. ఇందుకు మేము సైతం అంటూ ప‌లువురు సినీతార‌లు ముందుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి సైతం త‌న‌వంతు బాధ్య‌త‌గా 'హ‌రిత‌హారం' ఛాలెంజ్‌ని స్వీక‌రించారు. అన్న‌య్య త‌న ఇంటి పెర‌ట్లో మొక్క‌లు నాటి హ‌రిత‌హారం ఉద్య‌మానికి నేను సైతం అంటూ బాస‌ట‌గా నిలిచారు. మెగాస్టార్ స్వ‌యంగా మొక్క‌ను నాటి, దానికి నీళ్లు పోస్తున్న ఫోటోల్ని ప్ర‌స్తుతం మెగాభిమానులంతా షేర్ చేస్తూ ఎవ‌రికి వారు హ‌రిత‌హారం చేప‌ట్టాల‌ని ఉద్య‌మిస్తున్నారు. మంచి కోసం మేము సైతం అంటూ మెగాభిమానులు క‌దిలొస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలు ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడాల‌న్న‌దే అన్న‌య్య చిరంజీవి ధ్యేయం. అందుకే ఆయ‌న అభిమానుల‌కు ఓ వీడియో సందేశం ఇచ్చారు. మా ఇంటి పెర‌ట్లో మూడు మొక్క‌లు నాటాను. ఇంత మంచి ప‌నికి స్ఫూర్తినిచ్చిన మిత్రులంద‌రికి ధ‌న్య‌వాదాలు అన్నారు. తాను ఈ మంచి ప‌ని చేయ‌డ‌మే గాక‌.. మరో ముగ్గురిని హ‌రిత‌హారం ఛాలెంజ్‌కి నామినేట్ చేశారు. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, మీడియా లెజెండ్ రామోజీరావు, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌ను హ‌రిత‌హారానికి ఆహ్వానించారు. ఓవైపు సైరా షూటింగులో బిజీగా ఉండీ కొంత స‌మ‌యాన్ని అన్న‌య్య ఇలా హ‌రిత‌హారం కార్య‌క్ర‌మానికి కేటాయించ‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

More News

'శైలజా రెడ్డి అల్లుడు' డేట్ క‌న్‌ఫ‌ర్మ్‌

నాగ‌చైత‌న్య, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'శైల‌జారెడ్డి అల్లుడు'. 'మ‌హానుభావుడు' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో

కీల‌క పాత్ర‌లో నారా రోహిత్‌....

బాణం సినిమాతో నారా రోహిత్‌ను హీరోగా ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు చైత‌న్య దంతులూరి త‌ర్వాత బ‌సంతి అనే సినిమాను డైరెక్ట్ చేశారు.

సీనియ‌ర్ నిర్మాత రాఘ‌వ క‌న్నుమూత‌

ప్ర‌తాప్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత, ప్ర‌ముఖ నిర్మాత కోటిప‌ల్లి రాఘ‌వ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ఆయ‌న స్వ‌గృహంలో గుండెపోటుతో క‌న్నుమూశారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'ప్రేమకు రెయిన్ చెక్'

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "ప్రేమ రెయిన్ చెక్".

కంగ‌నా సినిమాలు తెలుగులో...

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ రెండు సినిమాల‌ను తెలుగు డైరెక్ట‌ర్సే చేస్తుండ‌టం విశేషం.