'ఓం నమో వేంకటేశాయ' నాగార్జున కెరీర్ లో కలికితురాయి - మెగాస్టార్ చిరంజీవి

  • IndiaGlitz, [Friday,February 10 2017]

అక్కినేని నాగార్జున ' దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై శిరిడిసాయి' నిర్మాత ఎ. మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం ఓం నమో వేంకటేశాయ'. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సంగీత ప్రియుల‌ను విశేషంగా అల‌రిస్తోంది. కొన్ని వందల‌ సంవత్సరాల క్రితం వేంకటేశ్వర స్వామి, . ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌ అవుతున్న సందర్భంగా . సినీ ప్ర‌ముఖుల కోసం స్పెష‌ల్ షోను ప్ర‌ద‌ర్శించారు. ఈ షో అనంత‌రం...
దిల్‌రాజు మాట్లాడుతూ - ''ఓం న‌మో వేంక‌టేశాయ ఒక అద్భుతం. సినిమా చివ‌రి అర్ద‌గంట క‌న్నీళ్ళు ఆగ‌లేదు. అన్న‌మ‌య్య త‌ర్వాత అలాంటి గొప్ప వెంక‌టేశ్వ‌ర‌స్వామి సినిమాను అందించిన నాగార్జున‌గారికి, రాఘ‌వేంద్ర‌రావుగారికి, మ‌హేష్ అన్న‌కు థాంక్స్‌'' అన్నారు.
వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ - ''మాట‌ల్లేవ్‌..అన్న‌మ‌య్య త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావుగారు, నాగార్జుగారు అద్భుతాన్ని క్రియేట్ చేసిన సినిమా అవుతుంది. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా'' అన్నారు.
పివిపి మాట్లాడుతూ - ఓం న‌మో వెంక‌టేశాయ ఒక గొప్ప దృశ్య కావ్యం. ఇలాంటి సినిమా చూసే అవ‌కాశం జ‌న్మ‌కు ఒక‌సారి మాత్ర‌మే వ‌స్తుంది. అద్భుతంగా ఉంది. నాగార్జున‌గారు, రాఘవేంద్ర‌రావుగారు, మ‌హేష్‌గారు స‌హా టీంకు ఆల్ ది బెస్ట్‌'' అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ - ''సినిమా చూడ‌గానే ఎమోష‌నల్‌గా అనిపించింది. నాకు తెలియ‌ని విష‌యాలు చాలా నేర్చుకున్నాను. అంద‌రినీ క‌ద‌లించే చిత్ర‌మ‌వుతుంది. అంద‌రూ త‌ప్ప‌కుండా చూడండి'' అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ''ఓం న‌మో వేంక‌టేశాయ సినిమా చూడ‌ట‌మే వండ‌ర్ ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. భ‌క్తి పార‌వ‌శ్యాలు పెల్లుబుకుతాయి. సెకండాఫ్ హృధ్యంగా ఉండ‌ట‌మే కాదు, సెకండాఫ్ అంతా క‌ళ్ళు చెమ‌ర్చాయి. ప్రతి స‌న్నివేశం అద్భుతంగా ఉంది. సినిమా చూడ‌టం భ‌క్తితో కూడిన ప్ర‌యాణం చేసిన‌ట్టు అనిపించింది. ఇలాంటి సినిమా తీయాలంటే రాఘ‌వేంద్ర‌రావుగారు, చెయ్యాలంటే నా మిత్రుడు నాగార్జున‌, తెర‌కెక్కించాలంటే నిర్మాత మ‌హేష్‌రెడ్డికే చెల్లుతుంది. గ‌తంలో అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడీసాయి చిత్రాల‌కు ధీటుగా ఉండే చిత్రం. నాగార్జున కెరీర్‌లో క‌లికుతురాయిలాంటి చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ. రాఘ‌వేంద్ర‌రావుగారు అద్భుతంగా తీస్తే..న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఇంకా గొప్ప‌గా చేశారు. సినిమా చూస్తే దివ్యానుభూతికి లోన‌వుతారు'' అన్నారు.
పి.వి.సింధు మాట్లాడుతూ - ''సినిమా చాలా గొప్ప‌గా ఉంది. నాగార్జున‌గారు, రాఘవేంద్ర‌రావుగారు స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌. ప్ర‌తి ఒక క్యారెక్ట‌ర్ చాలా బాగా చేశారు. సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ అవుతుంది'' అన్నారు.
నిర్మాత ఎ.మ‌హేష్ రెడ్డి మాట్లాడుతూ - ''ఈ సినిమా గోవిందుడి ప్ర‌యాణం. నాగార్జున‌గారు హ‌థీరాంబావాజీగా ఒదిగిపోయి గోవిందుడిని మై మ‌ర‌పించారు. తిరుమ‌ల‌లో త‌ప్పు చేయ‌కూడ‌ద‌ని, అస‌లు వెంక‌టేశ్వ‌ర‌స్వామికి బాలాజీ అనే పేరు ఎందుకు వ‌చ్చింద‌ని ఇలా ఎన్నో ర‌కాల మెసేజ్‌ల‌ను ఇచ్చారు. రాఘ‌వేంద్ర‌రావుగారు చేసిన అద్భుతం, నాగార్జున‌గారి యాక్టింగ్, కీర‌వాణిగారు సంగీతం, గోపాల్‌రెడ్డిగారి కెమెరా వ‌ర్క్‌, భార‌విగారి క‌థ ఇలా అన్ని ఉన్న సినిమా చూడ‌గానే నా జ‌న్మ ధ‌న్య‌మైపోయింద‌నుకున్నాను'' అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఎ.నాగ‌సుశీల‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌, దానం కిషోర్‌, ర‌ఘ‌రామ‌రాజు త‌దితరులు పాల్గొన్నారు.

More News

అనన్యగా ఆకట్టుకోనున్న తాప్సీ

నవతరం కథానాయికల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. బాలీవుడ్ లోనూ రాణిస్తున్న భామ తాప్సీ. నిన్నటివరకూ గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన తాప్సీ, "పింక్" మొదలుకొని అన్నీ వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటూ నటిగా మంచి గుర్తింపు సాధించింది.

ఆర్జీవీ పుట్టినరోజున రానున్న సర్కార్ 3

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం 'సర్కార్ 3'. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్ లో 3వ భాగం కావడం విశేషం.

'ఓం నమో వేంకటేశాయ' నా కెరీర్ లో ది బెస్ట్ చిత్రం అవుతుంది : కింగ్ నాగార్జున

అక్కినేని నాగార్జున ` దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ‘శిరిడిసాయి’ నిర్మాత ఎ. మహేష్రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’.

సినిమా కోసం తాప్సీ బెంగాలీ నేర్చుకుంది

దగ్గుబాటి రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఘాజీ. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో నిర్మించిన ఈ చిత్రం 1971 బ్యాక్డ్రాప్లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్వాటర్లో జరిగిన యుద్ధనౌక పేరే ఘాజీ. ఈ సినిమాలో తాప్సీ ఓ కీలకపాత్రలో నటించింది.

నానితో మలయాళ ముద్దుగుమ్మ...

సిద్దార్థ, శృతిహాసన్, హన్సికలతో రూపొందిన సినిమా ఓ మై ఫ్రెండ్ అనే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్రాజు నిర్మించాడు.